అంబటి మతి భ్రమించింది... పిచ్చిపట్టినట్టు మాట్లాడుతున్నారు
- ( గోదావరి - ఇండియా హెరాల్డ్ ) . . .
టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను మండల టీడీపీ తీవ్రంగా ఖండించింది. వైసీపీకి ఫ్యూచర్ లేదన్న నిర్ణయానికి వచ్చిన అంబటి ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనవసర ప్రేలాపనలు చేస్తున్నారని మండల టీడీపీ అధ్యక్షులు కిలారు సత్యనారాయణ ధ్వజమెత్తారు. అంబటి రాంబాబు కాదని అంబటి కాంబాబు అని పలువురు మండల టీడీపీ నేతలు విమర్శించారు. చంద్రబాబుపై అంబటి వ్యాఖ్యలు నిరసిస్తూ ఆదివారం సాయంత్రం మండలంలోని తాడిచర్ల కాలనీ అంబేద్కర్ విగ్రహం వద్ద అంబటి దిష్టిబొమ్మ దహనం చేయడంతో పాటు నిరసన వ్యక్తం చేశారు. అంబటి రాంబాబు మంత్రిగా ఉన్నప్పుడు సుకన్య గంటా అరగంటా అంటూ చేసిన లీలలే ఆయన పేరును కాంబాబుగా మార్చేశామని ఎద్దేవా చేశారు. అలాంటి అంబటి కాంబాబు ఇప్పుడు చంద్రబాబు ను తిట్టడం చూస్తుంటే చాలా కామెడీ గా ఉందని కూడా కిలారు సత్యనారాయణ విమర్శించారు.
అంబటి రాంబాబుకు భవిష్యత్తులో అధికారం రాదన్న నిరాశతోనే పిచ్చిపట్టి మతిభ్రమించి మాట్లాడుతున్నారని కిలారు విమర్శించారు. అనంతరం టీడీపీ శ్రేణులు అంబటి దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. అలాగే పార్టీ యువనేత, మంత్రి నారా లోకేష్‌పై వైసీపీ మరో మాజీ మంత్రి జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలను కూడా కిలారు, టీడీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. కార్యక్రమంలో కిలారు సత్యనారాయణతో పాటు సర్పంచ్‌లు గోరింక దాసు , పసుమర్తి పార్థసారథి బాబు , గూడపాటి కేశవరావు , ఘంటా సత్యంబాబు , వేముల హనుమంతు , కరిపోతు కృష్ణ , రెబ్బ పరాత్పరరావు , సాయన శ్రీకాంత్ , నల్లమిల్లి భుజంగరావు , అబ్బూరి రాజా , పాకలపాటి రవి , కారే సాల్మన్ రాజు , కటికర్ల నాని , డాకూరి ఆశీర్వాదం , తదితరులు పాల్గొన్నారు.