ఆయన్ని బ్యాడ్ చేయొద్దు.. అదంతా ఫేక్.. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఇష్యూపై మాట మార్చిన వీణ..!

Pandrala Sravanthi
రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్..ప్రస్తుతం ఈ పేరు ఏపీ రాష్ట్రంలో ఎంత వైరల్ గా మారిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రైల్వే కోడూరులోని జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఓ మహిళ ఉద్యోగిని వాడుకొని వదిలేసాడని, వైసిపి వారి వీడియో కాల్ హిస్టరీని బయటపెట్టింది. ఆ తర్వాత ఆ మహిళ ఉద్యోగి వీణ కూడా అరవ శ్రీధర్ చేసిన పనిని బయటపెట్టింది.అరవ శ్రీధర్ తనకు పెళ్లి అయిందని తెలిసినా కూడా ఫేస్బుక్లో పరిచయమై మూడు రోజుల్లోనే ఫోన్లు మాట్లాడడం స్టార్ట్ చేసి ఓ రోజు ఏకంగా కార్లో తనని బయటకు తీసుకువెళ్లి రేప్ చేశాడని తెలిపింది. ఆ తర్వాత చాలా సార్లు భయపెట్టి బెదిరించి శారీరకంగా కలిశాడని, నిన్ను నేను ప్రేమిస్తున్నాను నీ భర్తకు విడాకులు ఇచ్చేసేయ్. నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో నేను కూడా ఓకే చెప్పి అప్పటి నుండి ఆయనతో మూవ్ ఆన్ అయ్యాను. 


ఆ తర్వాత నాకు ఐదు సార్లు ప్రెగ్నెన్సీ వచ్చి అబార్షన్ కూడా జరిగింది. అది కూడా శ్రీధర్ వల్లే.. శ్రీధర్ బలవంతం పెట్టడం వల్లే నేను అబార్షన్ చేయించుకున్నాను.. కానీ ఈ మధ్యనే జనవరిలో నీకు నాకు సెట్ కాదు. నిన్ను వదిలేస్తున్నాను. ఏం చేసుకుంటావో చేసుకో.. నీ దిక్కున్న చోట చెప్పుకో అని నన్ను వదిలేసాడు అంటూ ఆ వీడియోలో తెలిపింది. ఇదంతా పక్కన పెడితే రైల్వే కోడూరు స్థానిక కూటమి నేత అయినటువంటి తాతంశెట్టి నాగేంద్ర ఓ షాకింగ్ వీడియో రిలీజ్ చేశారు. అయితే ఈ వీడియో పై వీణ మాట్లాడుతూ.. తాతంశెట్టి నాగేంద్ర చెప్పే మాటలు పూర్తిగా అవాస్తవం. ఆయన ఓ బ్రోకర్. ఆయనకి మా గురించి ఏం అవసరం.. నేను యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నందు వల్లే శ్రీధర్ నన్ను పెళ్లి చేసుకోవాలని చూసాడు అని అన్న నాగేంద్ర మాటల్లో ఎలాంటి నిజం లేదు.


 నా వ్యక్తిగత సంబంధానికి,యుపిఎస్సి కి ముడి పెట్టడం సరికాదు.. తాతంశెట్టి నాగేంద్ర రాజకీయాల గురించి మాట్లాడకుండా నాకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడాలి. రాజకీయాలు మాట్లాడకండని ముందునుండే చెప్పాను. శ్రీధర్ పాత కేసులు తాతంశెట్టికి అనవసరం. నేను యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నానని శ్రీధర్ నన్ను ప్రేమించాడు అనే దాంట్లో ఎలాంటి నిజం లేదు. ఈ విషయంలో శ్రీధర్ ను బ్యాడ్ చేయకండి. ఆయన నన్ను నన్నుగానే ప్రేమించా.. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ ఆ తర్వాత ఏమైంది.. ఎందుకు మోసం చేశాడు అనే  విషయం గురించి మాత్రమే నాకు కావాలి అంటూ మహిళా ఉద్యోగి వీణ మరో సంచలన వీడియో విడుదల చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: