ఏపీ: ఉద్యోగులకు బకాయి బదులు భూముల ప్రతిపాదన..?
దీంతో ఏపీ ప్రభుత్వం తమకు చెల్లించాల్సిన వేలకోట్ల బకాయిల కోసం ప్రతిసారి అడిగి, ఉద్యమం చేసే పరిస్థితి లేకపోవడంతో ఉద్యోగులు చేసేదేమీ లేక ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వినిపిస్తోంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వానికి ఉద్యోగుల సంఘం ఒక ప్రతిపాదన తీసుకువచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు బదులుగా విలువైన భూమిని ఉద్యోగులకు ఇవ్వాలనే డిమాండ్ తీసుకువచ్చింది. ఈసారి బడ్జెట్లో ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిల కోసం నిధులు కేటాయించలేని స్థానంలో ఉద్యోగులకు భూములను ఇవ్వాలని ఉద్యోగాల సంఘం కోరుతోంది.
ఈ మేరకు ఉద్యోగాల సంఘ అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ, ప్రధాన కార్యదర్శి విజయానంద్, ఆర్థిక మంత్రి పర్యాయవల కేశవుకు ప్రతిపాదనలు అందించారు. ఈ నెలలోనే రాష్ట్రంలో ఉండే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కూడా ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యల పైన వినతి పత్రాలని ఇవ్వబోతున్నట్లు తెలియజేశారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు రూ .35 వేల కోట్లకు చేరాయని, వీటిని చెల్లించలేని పరిస్థితులలో ఏపీ ప్రభుత్వం ఉన్నందువలన వాటి స్థానంలో భూములను ఇవ్వాలి అంటూ ప్రతిపాదన తీసుకువచ్చామని ఉద్యోగ సంఘాల నేతలు చెప్పుకొస్తున్నారు. అలాగే ఉద్యోగులకు వెంటనే పిఆర్సిని కూడా నియమించాలంటూ కోరుతున్నారు. మరి ఉద్యోగులు డిమాండ్ చేస్తున్న ఈ విషయం పైన ఏపీ ప్రభుత్వం ఏ విధమైనటువంటి క్లారిటీ ఇస్తుందో చూడాలి మరి.