కవితకి కౌంటర్ ఇచ్చిన కేటీఆర్.. పార్టీలో నీ బతుకు అంతే అంటూ.?

Pandrala Sravanthi
కేటీఆర్, కవిత ఇద్దరు ఒక తల్లి కడుపున పుట్టిన వాళ్లే అయినప్పటికీ ఇద్దరి మధ్య ప్రస్తుతం పొసగడం లేదు. ఏపీలో షర్మిల జగన్ ల పరిస్థితి ఎలా తయారయ్యిందో ప్రస్తుతం తెలంగాణలో కూడా కేటీఆర్, కవితల పరిస్థితి అలాగే తయారైంది. తండ్రి పెట్టిన పార్టీకి కొడుకే వారసుడు అన్నట్లుగా.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పార్టీకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారసుడు కాగా.. తెలంగాణలో కేసీఆర్ పెట్టిన పార్టీకి కేటీఆర్ వారసరవుతాడు. అయితే కేటీఆర్ కి కవితకు ఎక్కడ చెడిందో తెలియదు కానీ కవిత లిక్కర్ కేసులో జైలుకు వెళ్లి బెయిల్ మీద బయటకు వచ్చినప్పటి నుండి కేసీఆర్ ఫ్యామిలీతో అంటీ ముట్టనట్లుగా ప్రవర్తిస్తుంది. అంతేకాకుండా ఓ రోజు బహిరంగంగానే కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయని, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు లపై కూడా విమర్శలు చేయడంతో చివరికి బీఆర్ఎస్ పార్టీ కవితను పార్టీ నుండి సస్పెండ్ చేసింది. 


దాంతో కవిత బీఆర్ఎస్ పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేసి జాగృతి పార్టీ ద్వారా ప్రజల్లోకి వెళ్తుంది.వచ్చే ఎన్నికల నాటికి పూర్తి స్థాయిలో అభ్యర్థులను తయారుచేసి జాగృతి అనే కొత్త పార్టీతో ముందుకు వస్తానని కూడా తెలియజేసింది. ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల హవా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలోనే కేటీఆర్ మున్సిపల్ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ పార్టీ తరపున నిలబెట్టిన అభ్యర్థి మంచివాడైనా చెడ్డవాడైనా కేసీఆర్ మొహం చూసి ఓట్లు వేయాలని మాట్లాడారు. అయితే ఈయన మాటలపై కవిత కౌంటర్ ఇచ్చింది. అభ్యర్థి చెడ్డవాడైతే కేసీఆర్ మొహం చూసి ఓట్లు ఎలా వేస్తారు. కేటీఆర్ ది రాచరికపు పోకడ అని,ఆయన మాటలు నియంత్రిత్వానికి నిదర్శనంగా ఉన్నాయని,ఎన్నికలలో గుణం చూసి ఓటు వేయాలి కానీ కేసీఆర్ మొహం చూసి ఓటు వేయడం ఏంటి.. మంచి అభ్యర్థిని ఎన్నుకోండి అంటూ కేటీఆర్ వ్యాఖ్యల్ని టార్గెట్ చేస్తూ మాట్లాడింది.


అయితే కవిత వ్యాఖ్యలపై తాజాగా కేటీఆర్ స్పందిస్తూ.. రాజకీయాల్లో ఎంతోమంది ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటారు. అలా మాట్లాడిన ప్రతి వ్యక్తికి సమాధానం చెప్పాలని లేదు. ప్రతి ఒక్కరి వ్యాఖ్యలకు కౌంటర్ ఇవ్వాల్సిన పనిలేదు. అయినా బీఆర్ఎస్ లో కవిత పరిస్థితి ఎలాంటిదో చెప్పనక్కర్లేదు. ఆమెను పార్టీ సస్పెండ్ చేసింది. అలాంటప్పుడు ఆమె గురించి నేను ప్రత్యేకంగా స్పందించాల్సిన పనిలేదు అంటూ కేటీఆర్ కవితను ఉద్దేశిస్తూ కౌంటర్ ఇచ్చారు. దీంతో చాలామంది కేటీఆర్ కవితను ఉద్దేశించి పార్టీలో ఆమె బతుకెలాంటిదో అందరికీ తెలుసు కదా అని పరోక్షంగా చెల్లికి కౌంటర్ ఇచ్చారు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: