రేట్ల ఆటలు సాగవు.. పెంచి అమ్మితే ఊరుకునేది లేదు – పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్!
పాలనలో పారదర్శకత ఉండాలని పవన్ బలంగా నమ్ముతారు. మద్యం షాపుల యజమానులు సిండికేట్‌గా మారి సామాన్యులను దోచుకుంటే చూస్తూ ఊరుకోమని పవన్ హెచ్చరించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే అమ్మకాలు జరగాలని, మద్యం షాపుల ముందు రేటు బోర్డులను కూడా తప్పనిసరిగా ప్రదర్శించాలని ఆదేశించారు."కేవలం షాపుల యజమానులకే కాదు, అధికారులకు కూడా పవన్ కళ్యాణ్ గట్టిగా చెప్పారు. ఎక్సైజ్ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలని, క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో నివేదికలు ఇవ్వాలని కోరారు.ఎవరైనా అధికారులు యజమానులతో కుమ్మక్కైతే వారిపై కూడా కఠిన చర్యలు ఉంటాయని పరోక్షంగా హెచ్చరించారు.
ఈ వార్త బయటకు రాగానే సోషల్ మీడియాలో 'పవన్ కళ్యాణ్ ఈజ్ బ్యాక్' అంటూ కామెంట్లతో నెటిజన్లు హోరెత్తిస్తున్నారు. "సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలోనూ తప్పు చేస్తే తల వంచాల్సిందే అని పవన్ కళ్యాణ్ నిరూపిస్తున్నారు" అంటూ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.సామాన్య మధ్యతరగతి ప్రజలకు భారం పడకుండా పవన్ తీసుకున్న ఈ నిర్ణయంపై రాష్ట్రవ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయి.మద్యం విక్రయాల విషయంలో అరాచకాలకు చెక్ పెట్టడమే లక్ష్యంగా డిప్యూటీ సీఎం అడుగులు వేస్తున్నారు. త్వరలోనే మరిన్ని ఆకస్మిక తనిఖీలు నిర్వహించే అవకాశం ఉందని సమాచారం.మొత్తానికి పవన్ కళ్యాణ్ తన గర్జనతో మద్యం సిండికేట్ల వెన్నులో వణుకు పుట్టించారు. ఎంఆర్‌పీ నిబంధనలను ఉల్లంఘిస్తే ఊరుకునే ప్రసక్తి లేదని పక్కా మాస్ వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే మద్యం లభించేలా చూడటమే తన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.