ఏంటి వేములవాడకు వెళ్తే పదవి పోతుందా..ఇదెక్కడి విడ్డూరం అనుకుంటారు ఈ విషయం తెలిసిన చాలా మంది నెటిజన్స్. అయితే ఈ విషయాన్ని స్వయంగా
తెలంగాణ సీఎం
రేవంత్ రెడ్డి నోటి నుండి రావడంతో చాలామంది ఆశ్చర్యపోతున్నారు. మరి నిజంగానే వేములవాడ రాజన్న ఆలయానికి వెళ్తే పదవి పోతుందా.. ఇంతకీ ఈ వ్యాఖ్యలు
రేవంత్ రెడ్డి ఎందుకు చేశారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం
తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల హడావిడి జరుగుతున్న నేపథ్యంలో
తెలంగాణ ముఖ్యమంత్రి పలు జిల్లాలు తిరుగుతూ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడమే కాకుండా
కాంగ్రెస్ ఈ రెండున్నర ఏళ్లలో చేసిన అభివృద్ధి ఏంటో సభలు సమావేశాలలో చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే
కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్న
రేవంత్ రెడ్డి తాజాగా చొప్పదండి నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.
ఈ నేపథ్యంలోనే వేములవాడ
ఎమ్మెల్యే ఆది
శ్రీనివాస్ రేవంత్ రెడ్డిని కలిసి వేములవాడకు రావలసిందిగా ఆహ్వానించారట. ఇక ఈ మాట వినడంతోనే కొంతమంది
రేవంత్ రెడ్డి పక్కన ఉన్న వాళ్ళు చెవిలో గుసగుసలు చెబుతూ మీరు వేములవాడకు వెళ్ళకండి. వేములవాడకు వెళ్తే పదవి పోతుంది అని చెప్పారట.దాంతో ఈ విషయం గురించి
రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. వేములవాడ వెళ్తే పదవి ఎందుకు పోతుంది. ఇదంతా తప్పుడు ప్రచారం. ఇప్పటికే చాలామందికి వేములవాడ వెళ్తే పదవి పోయింది అంటున్నారు. కానీ అది తప్పని నేను నిరూపిస్తా.. కచ్చితంగా వేములవాడకు వెళ్లే తీరుతా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు
రేవంత్ రెడ్డి.
అంతేకాకుండా గత ప్రభుత్వంలో
కేసీఆర్ వేములవాడకి 150 కోట్ల నిధులు ఇస్తామని చెప్పి మాట తప్పి మోసం చేశారు. కానీ
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వేములవాడకు 150 కోట్లు కేటాయించింది. ప్రస్తుతం అక్కడ అద్భుతంగా పనులు జరుగుతున్నాయి.తెలంగాణ ఇవ్వద్దని ఎంతోమంది
ఏపీ పెట్టుబడిదారులు సోనియాగాంధీకి అడ్డుపడ్డా కూడా వారి మాటలు వినకుండా
తెలంగాణ ఇచ్చింది.
తెలంగాణ ఇస్తే
కాంగ్రెస్ కు నష్టం కలుగుతుందని తెలిసిన బలిదానాలు చూడలేక ఇచ్చింది. అలా వచ్చిన తెలంగాణకి
కేసీఆర్ ముఖ్యమంత్రి అయి పరిపాలనను గాలికి వదిలేసి ప్రజలను దోచుకు తిని ఆస్తులు సంపాదించుకున్నాడు. అభివృద్ధిని గాలికి వదిలేసాడు అంటూ
రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు