జనసేన పార్టీలోకి ఎంట్రీ ఇచ్చిన ప్రముఖ నటి..!

Divya
జనసేన పార్టీని రెండు తెలుగు రాష్ట్రాలలో మరింత ముందుకు తీసుకువెళ్లాల మొదలుపెట్టారు జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జనసేన పార్టీ కూడా అక్కడ పోటీ చేయాలని భావిస్తోంది. దీంతో కొంతమంది సినీ సెలబ్రిటీలు జనసేన పార్టీలో చేరడంతో అక్కడ ప్రచారాన్ని కూడా మొదలుపెట్టారు. ఇప్పుడు తాజాగా ప్రముఖ నటి మోడల్గా పేరు సంపాదించిన నివితా మనోజ్ శుక్రవారం రోజున జనసేన పార్టీలోకి చేరారు.


హైదరాబాదులో జనసేన పార్టీ కార్యాలయంలో జరిగే ఒక కార్యక్రమంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి  సమక్షంలో నివితా జనసేన పార్టీలోకి చేరారు. పవన్ కళ్యాణ్ సిద్ధాంతాల పట్ల తనకు నమ్మకం ఉందని ఆయన నాయకత్వంలో పనిచేసేందుకు పార్టీలోకి చేరానట్టు తెలిపింది నివితా. నివితా తెలుగులో చాలా తక్కువ సినిమాలలో మాత్రమే నటించింది ఇమే పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమాలో కూడా ఒక కీలకమైన పాత్రలో కనిపించింది. అలాగే గతంలో ప్రభాస్ నటించిన డార్లింగ్ సినిమాలో కూడా నటించింది.



నివితా మనోజ్ కేవలం నటిగానే కాకుండా పవన్ కళ్యాణ్ అభిమానిగా కూడా నిరంతరం సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసే ఫోటోలు వైరల్ గా మారుతుంటాయి. గతంలో హరిహర వీరమల్లు చిత్రానికి సంబంధించి ఒక ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ కాళ్ళకి మొక్కి తనకున్న భక్తిని చాటుకుంది. అంతేకాకుండా ఒకానొక ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గారు తాగి పారేసిన వాటర్ బాటిల్లను తన ఇంట్లో  తాను గుర్తుగా దాచుకున్నానని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు. నివితా మనోజ్ వృత్తిరీత్యా హోటల్ మేనేజ్మెంట్ చదివినప్పటికీ , ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి పలు చిత్రాలలో నటిస్తోంది. వీటికి తోడు కొన్ని దిగ్గజ బ్రాండ్లకు కూడా బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది. అలాగే పలు సినిమా ఈవెంట్లకు యాంకర్ గా కూడా వ్యవహరిస్తూ బాగానే పేరు సంపాదించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: