రేషన్ కార్డుదారులకు షాక్.. బియ్యం బదులు..డబ్బు జమ?
అలాగే మరి కొంతమంది రేషన్ బియ్యంతో నకిలీ బియ్యాన్ని(పాలిష్ చేసి) తయారు చేస్తూ మార్కెట్లో అమ్మేస్తున్నారు. దీంతో కేంద్ర ఒక ఆలోచన చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ సిస్టం ద్వారా రేషన్ కార్డుదారులకు నగదును నేరుగా బ్యాంకు ఖాతాలో జమ చేసే ఆలోచనతో ఉన్నట్లు వినిపిస్తున్నాయి. దీంతో అక్రమాలకు అడ్డుకట్టు వేసే విధంగా ఉంటుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దీంతో రేషన్ కార్డుదారులకు సరుకులకు బదులుగా నగదు తమ ఖాతాలలో జమ చేయబోతున్నట్లు సమాచారం. ఈ డబ్బులను రేషన్ కార్డు వినియోగదారుల తమకు అవసరమైన సరుకులను కొనుగోలు చేసుకునే విధంగా ఉంటుంది.
దీనివల్ల రేషన్ సరఫరాలో జరుగుతున్న అక్రమాలను కూడా అరికట్టవచ్చని కేంద్రం చెబుతోంది. త్వరలోనే ఈ సంస్కరణ దిశగా మోడీ ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం రేషన్ షాపుల ద్వారా రాగులు, చక్కెర, గోధుమలు ,బియ్యం వంటివి మాత్రమే అందిస్తున్నారు. ఇప్పుడు నేరుగా డబ్బులను రేషన్ కార్డు దారులకు డబ్బులు బదిలీ చేయడంతో ప్రజలు తమకు నచ్చిన వస్తువులు కొనుగోలు చేసుకోవచ్చనే విధంగా భావిస్తోంది. అయితే ఇప్పటికే చండీఘఢ్, మహారాష్ట్ర, పుదుచ్చేరి మరికొన్ని ప్రాంతాలలో ఈ ట్రాన్స్ఫర్ విధానాన్ని పైలెట్ ప్రాజెక్టుగా మొదలుపెట్టారు. అక్కడ ఫలితాలు అనుకూలంగా రావడంతో దేశవ్యాప్తంగా అమలు చేసేలా కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ విధానాన్ని కొంతమంది ఖండిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.