తెలంగాణ మున్సిపల్ ఎలక్షన్: ఏఏ పార్టీలకు ఎన్ని స్థానాలు గెలిచాయంటే..?
వార్డుల పరంగా చూస్తే.. మొత్తం మీద 2,581 వార్డులు ఉండగా ఇందులో కాంగ్రెస్ పార్టీ 1,347 వార్డులు, బిఆర్ ఎస్ పార్టీ 716 వార్డులు, బిజెపి పార్టీ 216, ఎంఐఎం, లెఫ్ట్ పార్టీలు, ఇతర పార్టీలన్నీ కూడా 257 చోట్ల ఘనవిజయాన్ని అందుకున్నాయి. దీంతో అధికార పార్టీ పైన పెరుగుతున్న వ్యతిరేకత మున్సిపాలిటీ , పంచాయతీ ఎన్నికలలో చాలా స్పష్టంగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు , అందులో భాగమైన 420 హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయకపోవడంతోనే ఇంత ప్రజావ్యతిరేకత మొదలయ్యిందనే విధంగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
తెలంగాణలోనే కాదు దేశంలో ఏ రాష్ట్రంలో అయినా సరే మున్సిపల్ ఎన్నికలలో అధికారంలో ఉన్న పార్టీ కచ్చితంగా 70 నుంచి 80 శాతం వరకు స్థానాలను సొంతం చేసుకుంటుంది. కానీ తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఎన్నికల ఫలితాలలో కేవలం 52% మాత్రమే కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. ఇంత తక్కువ రావడం బహుశా దేశంలోనే ఇదే మొదటిసారి కావచ్చు అంటూ విశ్లేషకులు చెబుతున్నారు. 2020లో 120 మున్సిపాలిటీ ఎన్నికలు జరగగా అందులో 112 మున్సిపాలిటీలను బిఆర్ఎస్ పార్టీ సొంతం చేసుకుంది. అంటే సుమారుగా 93.33% వరకు మున్సిపాలిటీలలో బిఆర్ఎస్ పార్టీ హవానే కొనసాగింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అయిన 116 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగగా కేవలం 66 స్థానాలని గెలిచింది. 52.15% శాతం మాత్రమే.. ఈ రెండు ఫలితాల మధ్య వ్యత్యాసం సుమారుగా 40% వరకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మరి ఇకనైనా అన్ని విషయాల పైన కాంగ్రెస్ పార్టీ జాగ్రతను తీసుకొని ముందుకు వెళుతుందేమో చూడాలి.