ఏపీ: వైసీపీ వ్యాల్యూ గుర్తిస్తున్న నేతలు.. సొంత గూటికి వెళ్ళనున్నారా..?

Divya
2024 ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కూటమి భారీ విజయాన్ని అందుకుంది .వైసిపి కేవలం 11 స్థానాలకే పరిమితం అయ్యింది. దీంతో వైసిపి పార్టీ నుంచి చాలామంది నేతలు కూటమి పార్టీలోకి వెళ్లారు. కానీ అలా వెళ్ళిన నేతలు ఇప్పుడు తిరిగి మళ్ళీ ఫ్యాన్ పార్టీలోకి చేరడానికి సిద్ధమవుతున్నట్లు వినిపిస్తున్నాయి. కూటమి పార్టీలో చేరడం వల్ల తమకు సరైన గుర్తింపు, గౌరవం లభించలేదని, కనీసం పదవులు కూడా దక్కడం చాలా కష్టమేనని భావించి మళ్లీ తిరిగి వైసిపి పార్టీ వైపు చూస్తున్నట్లు వినిపిస్తున్నాయి.


ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదట్లో ఎమ్మెల్సీలు, కొంతమంది ఎక్స్ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు  కూటమి పార్టీలో( జనసేన ,టిడిపి, బిజెప) చేరారు. అలా చేరిన వారెవరు కూడా సంతృప్తిగా లేరని తెలిసింది. వైసిపి పార్టీ నుంచి ఇతర పార్టీలలోకి చేరిన నేతలను కూటమినేతలు శత్రువులు గానే భావిస్తున్నారని వినిపిస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కర్రి పద్మశ్రీ 2023లో గవర్నర్ కోటాలో వైసిపి పార్టీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అనంతరం సీఎం చంద్రబాబు సమక్షంలో  టీడీపీలో  చేరింది.కాకినాడలో జరిగే ఎటువంటి కార్యక్రమానికి కూడా ఆమెకు ఎటువంటి ఆహ్వానం లభించడం లేదు. దీంతో తన నియోజకవర్గంలోని మరొక గ్రూపు పెట్టడం ఇష్టం లేక సైలెంట్ గా ఉంది. దీంతో పార్టీ మారి తప్పు చేశామనే భావన కూడా లుగుతోంది.

అలాగే కైకలూరు కు చెందిన జయ మంగళ వెంకటరమణ టిడిపి పార్టీలో 20 దశాబ్దాలుగా పనిచేశారు. కానీ 2023లో టిడిపిని వీడి వైసిపి పార్టీలో చేరగా 2024లో జగన్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. 2024 అసెంబ్లీ ఎన్నికలలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో జనసేన పార్టీలోకి చేరారు. అలా చేరిన కూడా ఎవరు పట్టించుకోలేదని, తాను అడగకపోయినా ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన తనకు జగన్ దేవుడని, తాను ఎప్పటికీ రుణపడి ఉంటానని వ్యాఖ్యలు చేయడంతో ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. దీన్నిబట్టి చూస్తే వైసిపి నుంచి వెళ్లినవారు దాదాపుగా ఇదే పరిస్థితి ఉన్నారని పలువురు వైసిపి నేతలు మాట్లాడుకుంటున్నారు. దీంతో వైసీపీ కార్యకర్తలు కూడా సోషల్ మీడియాలో పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
మరి రాబోయే 2029 ఎన్నికలలో ఎవరు ఏ ఏ పార్టీలు మారుతారేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: