ఉగాదికి ఏపీకి కొత్త సీఎం.. ఇప్పటి నుండే పావులు కదుపుతున్న లోకేష్.?

Pandrala Sravanthi
చాలా రోజుల నుండి ఏపీ రాజకీయాల్లో వినిపిస్తున్న మాటే ఇది.. ఉగాదికి ఏపీలో సీఎం మార్పు ఉంటుంది అని తెగ ప్రచారం నడుస్తోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది. అయితే ప్రస్తుతం ఏపీ కి సీఎంగా సీనియర్ నాయకుడు చంద్రబాబు నాయుడు ఉన్నారు. అయితే ఈ ఏడాది ఉగాది మార్చి 19న సీఎం సీటు నుండి చంద్రబాబు నాయుడు తప్పుకొని తన కొడుకు లోకేష్ ని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోపెట్టబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అధికారంలో ఉన్నప్పుడే తన కొడుకుకి ముఖ్యమంత్రి పీఠాన్ని అందించి మరో మూడు సంవత్సరాల పాటు ఏపీ ప్రజలకు ముఖ్యమంత్రిగా లోకేష్ ని మరింత దగ్గరకి చేర్చి యువతరాన్ని ఆకర్షించాలని చంద్రబాబు నాయుడు ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.


 ఇప్పటికే లోకేష్ యువ నాయకుడిగా రాజకీయాల్లో ఎంతోమంది యువతను ఆకర్షిస్తున్నారు. ఒకప్పుడు లోకేష్ ని బచ్చా అని..ఏది చేతకాదని.. పిల్లబచ్చా అంటూ నిందించిన వారే ఇప్పుడు లోకేష్ ని శభాష్ అంటూ మెచ్చుకుంటున్నారు. అయితే సీఎం కావాలంటే చిన్న విషయం కాదు. ఎంతోమంది మెప్పు పొందాల్సిందే. అందుకే లోకేష్ ఇప్పటినుండే పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది.అయితే ఏపీలో ఉగాదికి కొత్త సీఎం రాబోతున్నాడు అనే వార్తలకు మరింత ఊతమిచ్చేలా లోకేష్ చేసే పనులు ఉన్నాయి.ఎందుకంటే నారా లోకేష్ రీసెంట్గా ప్రతి జిల్లాలోని టిడిపి ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను ఆత్మీయ విందు పేరుతో పిలిపించుకొని వారితో కలిసి కూర్చొని మాట్లాడి భోజనాలు కూడా చేస్తున్నారు. కేవలం ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు మాత్రమే కాదు వారి కుటుంబ సభ్యులు కూడా ఈ విందులో పాల్గొంటున్నారు.


అయితే సడన్గా ఎప్పుడూ లేనిది ఆత్మీయ విందు పేరుతో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను ఆకట్టుకోవడానికి కారణం సీఎం మార్పు అనే తెలుస్తోంది. 2029 నాటికి పార్టీ పగ్గాలు లోకేష్ చేతిలో ఉండాలని చంద్రబాబునాయుడు ఆలోచన చేస్తున్నారట. ఈ మూడు సంవత్సరాలు లోకేష్ ముఖ్యమంత్రిగా కొనసాగితే వచ్చే ఎలక్షన్స్ సమయానికి లోకేష్  ని సమర్థవంతమైన నాయకుడిగా ప్రజలు గుర్తించాలని చంద్రబాబు నాయుడు ఆలోచన చేస్తున్నారట.అందుకే మార్చి 19న ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం జరగబోతుందని,మార్చి 19న లోకేష్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారని ప్రచారం జరుగుతుంది. మరి నిజంగానే ఏపీ రాజకీయాల్లో సీఎం మార్పు ఉంటుందా.. లేక ఇది ఊహగానాలేనా అనేది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: