ఏపీ: మార్చి 8న మహిళలకు రెండు కొత్త పథకాలు..?

Divya
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం పలు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తోంది. సూపర్ సిక్స్ హామీలు అమలు చేసిన, మరికొన్ని పథకాలను అమలు చేయలేదని ప్రతిపక్ష పార్టీలు ట్రోల్ చేస్తున్నాయి. ముఖ్యంగా మహిళలకు ప్రతినెల ఆడబిడ్డ నిధి కింద రూ.1500 రూపాయలు నెల నెల అధికారంలోకి వస్తే ఇస్తామని చెప్పిన ఇప్పటివరకు అమలు చేయకపోవడంతో మహిళలు అసంతృప్తితో ఉన్నారు. అలాగే నిరుద్యోగ భృతి విషయంలో రూ .3000 నిరుద్యోగులకు అందిస్తామని చెప్పి అందించకపోవడంతో అసహనంతో ఉన్నారు. కానీ తాజాగా డ్వాక్రా మహిళలకు సైతం ఒక గుడ్ న్యూస్ అయితే అందించింది ఏపీ ప్రభుత్వం.


వచ్చే నెలలో మరో రెండు కొత్త పథకాలను ప్రారంభించడానికి సిద్ధమయ్యింది. మార్చి 8 వ తేదీన మహిళా దినోత్సవం సందర్భంగా.. సెర్ఫ్ ఏర్పాటు 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ప్రకటన చేయడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమయ్యింది. ముఖ్యంగా ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, ఎన్టీఆర్ కల్యాణ లక్ష్మి పథకాలు అమలు చేయబోతున్నట్లు సమాచారం. ఈ పథకాలు డ్వాక్రా మహిళా కుటుంబ సభ్యులలో  పిల్లల చదువుకు, వివాహాలకు చేయూతనిచ్చేలా ఉంటుంది. ఈ రెండు పథకాలలో భాగంగా శ్రీనిధి బ్యాంకు ద్వారా డ్వాక్రా మహిళలకు లక్ష రూపాయల వరకు పావుల వడ్డీ రుణం అందిస్తారట.



అయితే ఈ రెండు పథకాలకు అర్హత ఉండాలి అంటే డ్వాక్రా సంఘంలో ఉండి కనీసం 6 నెలల పాటు అంతకంటే ఎక్కువ కాలం ఉన్నవారికి మాత్రమే అర్హులు అన్నట్టుగా తెలుస్తోంది. ఎన్టీఆర్ లక్ష్మీ కల్యాణ పథకం ద్వారా కుమార్తెల వివాహం కోసం రూ. 10వేల నుంచి లక్ష రూపాయల వరకు రుణం తీసుకోవచ్చు. వీటిని 48 వాయిదాలలో చెల్లించాల్సి ఉంటుంది. వీటిని తీసుకోవాలి అంటే వివాహానికి సంబంధించి పత్రం పెళ్లి ఖర్చు అంచనా సమర్పిస్తే చాలు.

ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకంలో భాగంగా స్కూలు, కాలేజీ ఫీజు కోసం ఈ డబ్బులను వినియోగించుకోవచ్చు. వీటికి కూడా రూ.10వేల నుంచి లక్ష రూపాయల వరకు రుణం. ఈ సొమ్మును 48 వాయిదాలలో చెల్లించాలి. ఈ రుణం పొందాలి అంటే పిల్లల అడ్మిషన్ లెటర్ తో పాటుగా విద్యాసంస్థల వివరాలు అందించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: