వీటిని పదే పదే వేడి చేసుకుని తింటున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా..?
చికెన్ చేసిన తర్వాత తిరిగి మళ్లీ వేడి చేసి తింటే అందులో ఉండే ప్రోటీన్ విషంగా మారుతుంది. కొద్దిగా కూర మిగిలిన తర్వాత చాలామంది ఫ్రిడ్జ్ లో పెట్టి మళ్ళీ తిరిగి వేడి చేసుకుని తింటారు. అయితే ఇది మంచి పద్ధతి కాదు అని వైద్యులు సైతం తెలియజేస్తున్నారు.
ఇక కోడిగుడ్లు కూడా రెండవసారి వేడి చేసి తినకూడదని ఇలా తింటే జీర్ణ సంబంధిత సమస్యలు ఏర్పడతాయని హెచ్చరిస్తున్నారు.
అన్నం పదేపదే వేడి చేసి తినడం వల్ల అందులో ఉండే ప్రోటీన్ బ్యాక్టీరియా హానికరమైన బ్యాక్టీరియాగా మారుతుంది. దీనివల్ల వాంతులు, విరోచనాలు కూడా అయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
చాలామంది నాన్ వెజ్ ఫుడ్ ని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకున్న తర్వాత వేడి చేసి మరి తింటారు. అలా తినడం వల్ల ఫుడ్ పాయిజన్ గా మారుతుంది.
చేపల కూరను కూడా మళ్లీ మళ్లీ వేడి చేయడం వల్ల, అందులో ఉండే మృదుత్వం పోయి పొడిగా మారుతుంది. కూర కూడా రుచి తగ్గిపోవడంతో పలు అనారోగ్య సమస్యలకు కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు.
పుట్టగొడుగులను వండిన వెంటనే తినడం మంచిది ఎక్కువసేపు నిల్వ ఉంచడం, రీహీట్ చేయడం వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు తలెత్తుతాయి.
ఆకుకూరలతో చేసిన ఏ వంటకాలలోనైనా సరే ఇందులో నైట్రేట్ ఉంటుంది. ఇలాంటి కూరలతో వండిన వంటకాలను వేడి చేసినప్పుడు అవి క్యాన్సర్ కారకాలను విడుదల చేస్తాయని, అందుకే ఎవరూ కూడా వేడి చేసుకుని మళ్లీ మళ్లీ తినడం మంచిది కాదని నిపుణులు తెలియజేస్తున్నారు.
చల్లారిన కూరను తిన్న పర్వాలేదు.. రీ వేడి చేసుకొని తినక పోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు.