చంద్రబాబుకి షాక్..వైసిపి నాయకులకు మద్దతుగా వంగవీటి రాధా.. పార్టీ మారుతున్నారా.?

Pandrala Sravanthi
వంగవీటి రాధా టీడీపీ పార్టీలో ఎన్నో ఏళ్లు కీలకంగా కొనసాగిన దివంగత వంగవీటి మోహన రంగా తనయుడే వంగవీటి రాధా.. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి కూటమిని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ఎంతో కృషి చేసిన వంగవీటి రాదా తాజాగా పార్టీ మారుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దానికి ప్రధాన కారణం కూడా ఉంది.రీసెంట్ గా వంగవీటి రాధా తన తండ్రి విగ్రహ ఆవిష్కరణలకు తప్ప టిడిపికి సంబంధించిన ఎలాంటి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. టిడిపి పార్టీకి దూరంగా వైసిపి నాయకులకు దగ్గరగా తరచూ వైసిపి వాళ్లను కలుస్తూ పార్టీ మారబోతున్నారు అనే సంకేతాలు టిడిపి క్యాడర్ కి బలంగా వెళ్లేలా చేస్తున్నారు. అంతేకాదు రీసెంట్గా కాకినాడ జిల్లాలోని డి.పోలవరంలో తన తండ్రి విగ్రహావిష్కరణకి వంగవీటి రాధ హాజరయ్యారు. 


అయితే ఈ కార్యక్రమానికి వైసీపీకి చెందిన జక్కంపూడి గణేష్, దాడిశెట్టి రాజాలు కూడా హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమంలో వంగవీటి రాధా తన తండ్రి గురించి మాట్లాడుతూ వైసిపి పార్టీలోని దాడిశెట్టి రాజా,జక్కంపూడి గణేష్ లకి మద్దతు ఇవ్వాలని తెలిపారు.వారికి మద్దతు ఇస్తేనే భవిష్యత్తులో మీకోసం వాళ్ళు ఏమైనా చేయగలరు. మీ ఆశీర్వాదం ఎప్పుడూ వాళ్ళ మీదే ఉండాలి.. వైసిపి లోని కాపులకు మద్దతు తెలిపాలి అంటూ ఆ కార్యక్రమంలో వంగవీటి రాధ మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే ఈ వీడియో చూసిన చాలా మంది ఇదేంటి వంగవీటి రాధా టిడిపి పార్టీలో ఉంటూ వైసిపి నాయకులకు మద్దతు తెలపాలని మాట్లాడం ఏంటి అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే వంగవీటి రాధా టీడీపీ పార్టీని వదిలి వైసిపిలోకి చేరుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.


దానికి ప్రధాన కారణం 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం చాలా కృషి చేశారు.పార్టీ అధికారంలోకి వచ్చాక తనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని ఆఫర్ చేయడంతో పార్టీ కోసం కష్టపడ్డారు. కానీ అధికారంలోకి వచ్చాక అసలు ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఏమో కానీ కనీసం ఆయన్ని పట్టించుకోవడంలేదనే అసంతృప్తితో ఉన్నారట. అంతేకాకుండా వైసిపి పార్టీ నుండి టిడిపిలోకి మారిన వాళ్లకి పదవులు ఇచ్చారు.కానీ టిడిపిలో ఉన్న తనకి ఎలాంటి పదవి ఇవ్వకపోవడంతో తీవ్ర అసహనంతో ఉన్న వంగవీటి రాధా వైసిపి నాయకులకి మద్దతుగా మాట్లాడుతున్నారు అని తెలుస్తుంది. మరి వైసీపి పార్టీకి మద్దతుతోనే ఆపేస్తారా..లేక టిడిపి పార్టీని వదిలి వైసీపీలో చేరతారా అనే విషయం తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: