కేరళ రాష్ట్రం పేరు మార్పు.. కొత్త పేరు ఏంటంటే..?

Divya
మన దేశంలో తాజాగా మరొక రాష్ట్రం పేరు మారినట్టు తెలుస్తోంది. ఇకపై కేరళ రాష్ట్రాన్ని కేరళం గా పిలవనున్నారు. ఈ మేరకు కేంద్ర క్యాబినెట్ సవరణ చేస్తూ ఆమోదం తెలిపింది. కేరళ రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలోని కేంద్రం కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అప్పట్లో మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ భాష ప్రాముఖ్య రాష్ట్రాల కోసం మొదటి SRC కమిషన్ ని ఏర్పాటు చేశారు. దీంతో ఒక భాష మాట్లాడేందుకు సంబంధించిన వాటిని ఒకే రాష్ట్రంగా ఏర్పాటు చేసుకునేందుకు వీటిని ఏర్పాటు చేశారు.


అలా మనదేశంలో ఏదైనా  ఒక రాష్ట్రం పేరు మార్చడానికి ఆర్టికల్ 3 అనుమతి ఇస్తుంది. కేరళ రాష్ట్రం పేరును కేరళం గా మార్చడానికి ఒకే ఒక్క కారణం అక్కడ రాష్ట్ర ప్రజలు మాట్లాడేటువంటి మలయాళం. ఆ భాషలో కేరళ అనేది సాంప్రదాయ పేరు కావడం చేత పేరును మార్చారు. 1956 కి ముందు ఇప్పుడు కేరళ అని పిలవబడే ప్రాంతం కేవలం ఒక్కే రాష్ట్రంగా ఉండేదికాదట. ఇందులో ట్రావెన్ కోర్, కొచ్చిన్ వంటి ప్రాంతాలు 1949లో విలీనం అయ్యాయి. దీంతో ట్రావెన్ కోర్-కొచ్చిన్, తిరు-కొచ్చి వంటి ప్రాంతాలు ఏర్పడ్డాయి.


నవంబర్ ఒకటి 1956న రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం మలయాళం మాట్లాడే ప్రాంతాలను ఒకటి చేయడం కోసమే కేరళ పేరుతో ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. అందుకే నవంబర్ 1న కేరళ పుట్టినరోజుగా జరుపుకుంటారు. కేరళ ప్రజలు కూడా కేరళను మలయాళంలో కేరళం అని పిలుస్తారు. తమ మాతృభాషకు అనుకూలంగా రాష్ట్రం పేరు ఉంటే బాగుంటుందని, అందుకు అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం కేరళ పేరు మార్చాలని కేంద్రాన్ని కోరింది. అందుకే పేరు మార్చినట్లు సమాచారం. ఇవే కాకుండా మనదేశంలో చాలా రాష్ట్రాల పేర్లు మారాయి.. 1969 వరకు మద్రాసు రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని తమిళనాడుగా 1969 జనవరి 14న మార్చారు. అలాగే 1973లో మైసూర్ రాష్ట్రాన్ని కర్ణాటక పేరుగా అదే ఏడాది నవంబర్ 1న మార్చారు. 2011లో ఒరిస్సా ను ఒడిశాగా మార్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: