ఏంటి కేసీఆర్ మౌనం వెనుక అంత పెద్ద వ్యూహం ఉందా.. ఆయన సైలెంట్ గా ఉన్నారంటే కచ్చితంగా ఏదో పెద్ద బాంబే పేల్చబోతున్నారు అని ఇప్పటికే ఎంతోమంది రాజకీయ విశ్లేషకులు మాట్లాడుకుంటున్న మాట. అయితే కేసీఆర్ ఎప్పుడైతే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కాలేకపోయారో అప్పటినుండి ఆయన అసెంబ్లీకి దూరమయ్యారు. ఏదో ఒకటి రెండు సార్లు అసెంబ్లీకి వచ్చి వెళ్లడం తప్ప అసెంబ్లీ సమావేశాలకు హాజరై ప్రజల తరఫున గట్టిగా పోరాడింది లేదు.. కానీ అప్పుడప్పుడు ప్రెస్ మీట్ లు పెడుతూ నేనున్నాను అని తెలంగాణ ప్రజలకు గుర్తు చేస్తూనే ఉన్నారు. అయితే ఇప్పటికే జరిగిన సర్పంచ్, మున్సిపల్ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీనే ఇచ్చింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా కూడా బీఆర్ఎస్ పార్టీ గట్టి పోటీని ఇచ్చి తమ ఉనికిని చాటుకుంది.
ఇదిలా ఉంటే చాలామంది రాష్ట్రంలో ఇన్ని జరుగుతుంటే కేసీఆర్ ఎందుకు బయటకు వచ్చి మాట్లాడడం లేదు. నోరు విప్పడం లేదు అని అనుకుంటున్నారు. అయితే కేసీఆర్ ఇలా మౌనం వహించడం వెనుక పెద్ద ప్లానే ఉందని తెలుస్తోంది. ఆ ప్లాన్ సక్సెస్ అయ్యాకే కేసీఆర్ బయటికి రావాలని చూస్తున్నారట.మరి ఇంతకీ కేసీఆర్ పన్నిన ఆ వ్యూహం ఏంటయ్యా అంటే ఇప్పటికే తెలంగాణ ప్రజల్లో కాంగ్రెస్ పై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అయితే ఈ వ్యతిరేకత పీక్ స్టేజికి వచ్చాకే బయటికి రావాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి పై చాలావరకు వ్యతిరేకత అయితే కనిపిస్తోంది.ఆయన ఎంత అభివృద్ధి చేయాలని చూసినా కూడా కేసీఆర్ చేసిన మంచిని మర్చిపోలేకపోతున్నారు తెలంగాణ ప్రజలు. అందుకే మళ్ళీ సారే రావాలి సారే కావాలి అంటూ ఆయన్నే తలుచుకుంటున్నారు.
అయితే రేవంత్ రెడ్డి పై ఉన్న ఈ వ్యతిరేకత పీక్ స్టేజికి వచ్చాక కేసీఆర్ బయటికి వచ్చి భారీ బహిరంగ సభలు, జిల్లాల పర్యటన మొదలుపెట్టి నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ టైం కి ప్రజల్లో మళ్ళీ తనపై భారీ అభిమానాన్ని పెంచుకొని అసెంబ్లీ ఎలక్షన్స్ లో అఖండ విజయం సాధించాలని కేసీఆర్ చూస్తున్నారట. అందుకే కేసీఆర్ ఎన్నిసార్లు రేవంత్ రెడ్డి బయటికి వచ్చి మాట్లాడాలి సలహాలు ఇవ్వాలి అని చెప్పినా కూడా బయటికి రావడం లేదు. అయితే కేసీఆర్ మౌనం వహించడం వెనుక రాజకీయ విశ్లేషకులు ఏదో ప్లాన్ ఉందని మాట్లాడుకుంటున్నారు. రేవంత్ రెడ్డి పై వ్యతిరేకత ఇంకా ఎక్కువ స్థాయికి వెళ్ళాలి అప్పుడే నేను బయటికి వెళ్లి సభలు సమావేశాలు పెట్టాలి అని కేసీఆర్ ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఒకవేళ ఇదే గనుక జరిగితే వచ్చే ఎన్నికల్లో నెక్స్ట్ సీఎం అయ్యేది మళ్లీ కేసిఆరే అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.