ఏపీ: 2029 లో పవన్ కళ్యాణ్ సీఎంగా ఛాన్స్..?
అలాగే జగన్ మీద వ్యతిరేకంగా కొన్ని సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ , టిడిపి అనుకూల మీడియా ఉన్నాయి కాబట్టి జగన్ నిరంతరం ఒక దోషిగా ప్రజల ముందు చూపించడం సాధ్యం. కానీ ప్రజా వ్యతిరేకత వంటి విషయాలను ఎలక్షన్స్ ఒక ఏడాది ముందు వాటిని పరిష్కరించడం అన్నటువంటిది సీఎం చంద్రబాబు వ్యూహమట. విదేశాలలో ఉన్నటువంటి ఎన్నారై తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలతో చెబుతున్నటువంటి విషయాలు, ఖచ్చితంగా 15 ఏళ్ల పాటు చంద్రబాబు అధికారంలో ఉంటారు.
ఈ ఐదేళ్లలో వైసీపీ పార్టీ చాలా డ్యామేజ్ అవుతుంది . ఒకవేళ 2029 ఎన్నికలలో టిడిపి కూటమి గెలిస్తే ఖచ్చితంగా వైసిపి పార్టీ నుంచి కూటమిలోకి నేతలందరు వచ్చేస్తారని, ఆ ప్లేస్ బీజేపీనా, జనసేన పార్టీలలో ఏదో ఒకటి ఎంచుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగే 2027లో లోకేష్ ని సీఎం చేయాలని, 2029లో కూటమి ఓటు బ్యాంకుతోనే కూటమి అధికారంలోకి వస్తుంది. ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ కి ఒక రెండు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి పదవి అవకాశం ఇస్తామంటూ అనౌన్స్మెంట్ చేయాలని, దీని ద్వారా కాపు సామాజిక వర్గం తమకు ఓటు వేస్తారని, ఎన్నో ఏళ్లుగా తమ వర్గంలో కూడా ఒక నాయకుడు సీఎంగా చూడాలని కోరుకుంటున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ని సీఎంగా చూడాలని చాలా కోరికతో ఉన్నారు. దీంతో 170 సీట్ల వరకు గెలిచే అవకాశం ఉంటుందని కూటమి వ్యూహం అన్నటువంటిది అంతర్జాతీయ సర్కిల్స్‌లో ఉన్నటువంటి మాట అన్నట్టుగా వైరల్ గా మారుతున్నాయి. 2029 ఎన్నికల ముందు ఏం జరుగుతుందో చూడాలి.