ప్రముఖ ఇండియన్ క్రికెటర్ ఇంట విషాదం..!

Divya
ప్రముఖ భారత క్రికెటర్ రింకూ సింగ్ కుటుంబంలో తాజాగా తీవ్ర విషాదం నెలకొంది. గత కొంతకాలంగా రింకూ సింగ్ తండ్రి ఖచంద్ర సింగ్ అనారోగ్యంతో బాధపడుతూ కన్నుమూశారు. గ్రేటర్ నోయిడాలో యథార్థ్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా ఈయన కాలేయ క్యాన్సర్ తో ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం ఇటీవల ఆయన ఆరోగ్యం క్షీణించడంతో పరిస్థితి కూడా విషమించడంతో వైద్యులు వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందించిన క్యాన్సర్ నాలుగవ స్టేజ్ కావడం చేత ఆయన శరీరం కూడా సహకరించక మరణించినట్లు తెలుస్తోంది.


ఖచంద్ర సింగ్ ఆరోగ్యం ఒక్కసారిగా విషమించడంతో అటు కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెందారు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించి వైద్యుల పర్యవేక్షణలో ఉంచిన ఫలితం లేదు. ప్రస్తుతం టి20 వరల్డ్ కప్ 2026 లో రింకూ సింగ్ ఆడుతున్న విషయం తెలిసిందే, తన తండ్రి ఆరోగ్య విషయం తెలుసుకున్న రింకూ అక్కడి నుంచి ఉన్నపలంగా ఇంటికి వెళ్లడం జరిగింది. చెన్నైలో జింబాబ్వే తో మ్యాచ్ కు ముందు తన తండ్రి ఆరోగ్యం విషయంగానే ఉందని రింకూ సింగ్ కు సమాచారం అందడంతో వెంటనే జట్టును విడిచి స్వస్థలానికి వెళ్లినట్లు సమాచారం.


అన్ని విధాలుగా వైద్యులు ప్రయత్నించినప్పటికీ ఖచంద్ర సింగ్ ఆరోగ్య పరిస్థితిని అదుపులోకి తీసుకురాలేకపోయారు. రింకూ సింగ్ తండ్రి మరణ వార్త తెలియగానే అటు అభిమానులు, పరువు క్రికెటర్లు ఆయన కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నారు. కష్టకాలంలో ధైర్యంగా ఉండాలంటూ పలువురు నేటిజన్స్ సైతం సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తండ్రి మరణంతో రింకూ టి20 వరల్డ్ కప్ ఆడడం అనుమానమే అన్నట్లుగా వినిపిస్తున్నాయి. అలాగే జట్టులో సంజు శాంసన్ ను కొనసాగించే అవకాశం ఉన్నట్లుగా వినిపిస్తోంది. ఐపీఎల్ లో తన ఆట ప్రదర్శనతో భారీ పాపులారిటీ సంపాదించుకున్న రింకూ సింగ్ ఇండియన్ టీమ్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి ఇదే ముఖ్య కారణమని కూడా చెప్పవచ్చు. ఇండియన్ జట్టులో ఫినిషర్ గా కూడా పేరు సంపాదించారు.గత ఏడాది ప్రముఖ రాజకీయ నాయకురాలు(సమాజ్ వాదీ పార్టీ ) ఎంపీ అయిన ప్రియా సరోజ్ తో ఎంగేజ్మెంట్ అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: