ఏపీ: ఉపాధ్యాయుడిపై దాడి చేసిన విద్యార్థి.. ఏం జరిగిందంటే..?

Divya
ఈమధ్య విద్యార్థులు తప్పు చేస్తే చేయి చేసుకోవాలంటే ఉపాధ్యాయులు భయపడే పరిస్థితి ఏర్పడుతోంది. విద్యార్థుల బాగుకోరే ఉపాధ్యాయులకు కూడా కొన్ని చేదు అనుభవాలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా తల్లిదండ్రుల గారాబం వల్ల కూడా పిల్లలు చిన్న వయసులోని చెడు అలవాట్లకు బానిసవుతున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా బాపులపాడు మండలం వీరపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్లో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తరగతి గదిలో ఒక చిన్నపాటి గొడవ కారణంగా ఉపాధ్యాయుడు పైన పదవ తరగతి విద్యార్థి పిడిగుద్ధులు కురిపించారు.



ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ గా వీడియో మారింది. పాఠశాల బాత్రూంలో సిగరెట్లు తాగుతున్నారని మందలించిన నేరానికి సైతం మాస్టర్ పైన పదవ తరగతి విద్యార్థి దాడి చేశారు. విద్యార్థి దాడి చేయడంతో ఆ గురువు నొప్పిని తట్టుకోలేక విలవిలాడుతున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. కేవలం చెడు అలవాట్లకు దూరంగా ఉండమని చెప్పినందుకు ఇలా చేస్తారా అంటూ ఆ ఉపాధ్యాయుడు వాపోయారు. పదవ తరగతి విద్యార్థి దాడి చేస్తున్న క్రమంలో కొంతమంది విద్యార్థులు అడ్డుకున్నప్పటికీ టీచర్ పైన మాత్రం దాడి చేశారు.



ఉపాధ్యాయులు వీడియో తీస్తూ మిగిలిన టీచర్లు చెబుతూ ఉన్న వినకుండానే స్టూడెంట్ టీచర్ పైన దాడి చేశారు. అయితే ఆ విద్యార్థి మాత్రం ఉపాధ్యాయుడు దుర్భాషలాడారంటూ వీడియోలో చెబుతున్నారు. కానీ తోటి ఉపాధ్యాయులు మాత్రం ఏదైనా ఉంటే హెడ్మాస్టర్ కి  కంప్లైంట్ చేయాలని ప్రశ్నించారు. అంతేకాకుండా వీడియో ఎందుకు రికార్డు చేస్తున్నారు అంటూ ఉపాధ్యాయుల పై కూడా ప్రశ్నించారు. అక్కడ ఒక ఉపాధ్యాయుడు నేను అన్ని తీస్తాను అంటూ సమాధానం ఇవ్వగా, సరేలే తీసుకోండి అంటూ  చివరికి వారి మీద కూడా ఫైర్ అయినట్టు వీడియోలో కనిపిస్తోంది. మరి ఈ విషయం పైన అధికారులు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: