బుల్లి పిట్ట: త్వరలోనే వాట్సాప్ నుంచి పెయిడ్ సబ్స్క్రిప్షన్ ..!
వాట్సాప్ లో ఏమేం రాబోతున్నాయంటే:
వాట్సప్ కు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందించి వాబిటా ఇన్ఫో .. వాట్సప్ ప్రీమియం ప్లాన్ కు సంబంధించి సమాచారాన్ని తమ ట్విట్టర్ వేదికగా పంచుకుంది.
వాట్సప్ ప్లస్ సేవలలో యాప్ థీమ్ మార్చుకునే అవకాశం ఉంటుంది. అలాగే యాప్ ఐకాన్ ని మనకు నచ్చిన విధంగా సెట్ చేసుకోవచ్చు. 14 రకాల స్టైల్స్ వాట్సప్ అభివృద్ధి చేస్తున్నట్లు వాబీటా తెలిపింది.
ప్రస్తుతం వాట్సాప్ లో మూడు చాట్లాను మాత్రమే మనం పిన్ చేసుకొని సదుపాయాన్ని కల్పించింది. ప్రీమియం సేవలో మాత్రం 20 వరకు పిన్ చేసుకోవచ్చు.
ప్రీమియం యాప్ లలో ప్రత్యేకించి నోటిఫికేషన్ అలాగే రింగ్ టోన్ ని కూడా సెట్ చేసుకోవచ్చు. ప్రత్యేకించి వాట్సప్ప్ కొన్ని టోన్స్ అందించనుంది.
ప్రీమియం సబ్స్క్రైబర్లకు ప్రత్యేకించి ఎక్స్క్లూజివ్ స్టిక్కర్స్ ను అందించనుంది. మెసేజ్లకు ఇచ్చే రిప్లై కాస్త భిన్నంగా ఉండేలా తీర్చిదిద్దుతోందట వాట్సప్.
పెయిడ్ ప్లాన్ అందుబాటులోకి వచ్చిన ఎప్పటిలాగానే వాట్సాప్ సేవలు ఉచితంగానే కొనసాగించుకోవచ్చు. అయితే ప్రీమియం సేవలు ఎప్పటి నుంచి వస్తాయనే విషయం మాత్రం ఇంకా వాబీటా తెలియజేయలేదు. ప్రస్తుతం ఆండ్రాయిడ్, ఐఓఎస్ యాప్ ల కోసం ప్రత్యేకించి అభివృద్ధి చేసి ఫీచర్స్ ధరల విషయాలను కూడా త్వరలోనే తెలిపే అవకాశం ఉన్నట్లు తెలిపింది వాబీటా.