సామాన్యులకు భారీ షాక్.. భారీగా పెరిగిన గ్యాస్ ధరలు..!
అటు వ్యాపార వర్గాల పైన కూడా మరింత భారం పడింది 19 కిలోల కమర్షియల్స్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 115 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ పెంచిన ధరలు నేటి నుంచి అమలులోకి వస్తాయంటూ ప్రభుత్వం ప్రకటించారు. ప్రస్తుతం గృహ వినియోగదారుల సిలిండర్ ధర రూ. 905 రూపాయల నుంచి రూ .965 రూపాయలకు చేరింది. కమర్షియల్ సిలిండర్ ధర రూ. 1961 నుంచి ఏకంగా రూ. 2076 రూపాయలకు పెరిగినట్లు తెలుస్తోంది
గ్లోబల్ స్థాయిలో జరుగుతున్న ఈ యుద్ధం వల్లే ఈ పెంపుకు కారణం అన్నట్లుగా వినిపిస్తున్నాయి. అలాగే అమెరికా- ఇరాన్ మధ్యయుద్ధ వాతావరణం మరింత ఉద్రిక్తత అవ్వడం చేత భవిష్యత్తులో గ్యాస్ కొరత ఏర్పడకుండా కేంద్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టి చమురు ఎల్పిజి ఉత్పత్తులను గరిష్ట స్థాయికి పెంచాలని భావిస్తోంది. అందుకే ఉత్పత్తి చేసిన గ్యాస్ ను మొట్టమొదట దేశీ అవసరాల కోసం మళ్ళించి ఆ తర్వాత వాణిజ్య అవసరాలను చూడాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది.ఎల్పిజి తయారీలో వాడేటువంటి వాయువులను ఎక్కడ కూడా పరిశ్రమలకు మళ్లించకూడదని వాటిని కేవలం వంటగ్యాస్ తయారీలకు మాత్రమే ఉపయోగించాలని ఆదేశాలను జారీ చేశారు. మార్కెట్లో ధరల విషయంలో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ ప్రజలకు మాత్రం వంట గ్యాస్ అందకుండా పోయే పరిస్థితి మాత్రం ఉండదంటూ కేంద్ర ప్రభుత్వం భరోసా ఇస్తోంది.