బీహార్ సీన్ రిపీట్..సీఎంగా పవన్ కళ్యాణ్.. డిప్యూటీ సీఎంగా లోకేష్..?

Pandrala Sravanthi
ఉగాది తర్వాత కొత్త సీఎం గా లోకేష్ పట్టాభిషేకం జరుగుతుందని ఏపీ రాజకీయాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. లోకేష్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముహూర్తం కూడా ఫిక్స్ అయిందని ప్రచారం జరుగుతున్న వేళ తాజాగా వైసిపి రెబల్ ఎమ్మెల్సీ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఆంధ్రప్రదేశ్ సీఎం గా పవన్ కళ్యాణ్..డిప్యూటీ సీఎం గా లోకేష్ అంటూ ఆయన మాట్లాడిన మాటలు ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. మరి ఇంతకీ ఆ ఎమ్మెల్సీ ఎవరు ... సీఎంగా పవన్ కళ్యాణ్ కావడం ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. తాజాగా ఏపీ వైఎస్ఆర్సిపి రెబల్ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఓ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. ఏపీలో ఉగాది తర్వాత బీహార్ సీన్ రిపీట్ కావాలి. ఎందుకంటే బీహార్ సీఎం నితీష్ కుమార్ జాతీయ రాజకీయాల్లోకి వెళితే ఆయన కొడుకుని డిప్యూటీ సీఎం గా చేశారు. 


సేమ్ ఇలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా జరగాలి. చంద్రబాబు జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నారనే ప్రచారం జరుగుతుంది. అందుకే చంద్రబాబు జాతీయ రాజకీయాల్లోకి వెళితే ముఖ్యమంత్రిగా ఆయన కొడుకు లోకేష్ ని కాకుండా పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రి చేయాలని మేమంతా కోరుకుంటున్నాం. కాపులలో ఒక్కసారైనా సీఎం కావాలి అనేది కాపుల ఎన్నో ఏళ్ల కల.. ఇప్పుడు ఆ కల నెరవేరాలని మేము కోరుకుంటున్నాం. కాపునేత అయినటువంటి పవన్ కళ్యాణ్ ని ఏపీ సీఎం గా చేయాలని కోరుకుంటున్నాం. ఒకవేళ పవన్ కళ్యాణ్ ని కాదని లోకేష్ ని సీఎం చేస్తే మాత్రం మేము అస్సలు ఊరుకోం. చంద్రబాబు కోసం అసెంబ్లీ ఎలక్షన్స్ సమయంలో పవన్ కళ్యాణ్ చాలా త్యాగం చేశారు.


ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ రుణం తీర్చుకోవాలి. జగన్మోహన్ రెడ్డిని గద్దె దించడం కోసం పవన్ కళ్యాణ్ ఒక మెట్టు దిగి చంద్రబాబు నాయుడుని అందలం ఎక్కించారు. పవన్ కళ్యాణ్ చేసిన త్యాగాన్ని మర్చిపోకుండా చంద్రబాబు ఆయనకు సీఎం పదవిని ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాపు సామాజిక వర్గం చాలా బలంగా ఉంది. అందుకే పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిని చేసి లోకేష్ ని ఉప ముఖ్యమంత్రిని చేయాలని తోట త్రిమూర్తులు డిమాండ్ చేశారు. ఒకవేళ లోకేష్ ని సీఎం చేస్తే ఊరుకునేదే లేదు రచ్చ రచ్చ చేస్తామంటూ కూడా ఆ ప్రెస్ మీట్ లో మాట్లాడారు. ప్రస్తుతం తోట త్రిమూర్తులు చేసిన కామెంట్స్ ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: