టి20 వరల్డ్ కప్ ఛాంపియన్: భారత్ ఖాతాలోకి మరో రికార్డ్..!

Divya
అహ్మదాబాద్ లో నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ 2026 టి20 వరల్డ్ కప్ ఫైనల్ మార్చి 8(నిన్నటి రోజున) జరగగా, అందులో టీమిండియా భారీ విజయాన్ని అందుకుంది. ఫైనల్ పోరులో న్యూజిలాండ్ ను భారత్ 96 పరుగుల తేడాతో ఓడించింది. దీంతో మూడోసారి విజేతగా నిలిచి భారత్ సరికొత్త రికార్డును సృష్టించింది. గత 2024 టి20 ప్రపంచ కప్ గెలుపు జ్ఞాపకాలను మరొకసారి గుర్తు చేస్తూ వేలాదిమంది అభిమానుల మధ్య భారత్ విశ్వ విజేతగా నిలిచింది. ఈ విజయంతో టి20 వరల్డ్ కప్ వరుసగా బ్యాక్ టు బ్యాక్ రెండు సార్లు టైటిల్ నెగ్గిన జట్టుగా పేరు సంపాదించడమే కాకుండా మూడుసార్లు ఛాంపియన్ గా నిలిచిన ఏకైక జట్టుగా ఇండియా నిలిచింది.


మొదట ఇండియా టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగులను చేసింది. దింతో 256 పరుగులు భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ భారత్ బౌలర్లు మొదటి నుంచే న్యూజిలాండ్ టీమ్ ని ఒత్తిడిలోకి నెట్టేశారు. బౌలింగ్లో బూమ్రా కేవలం 15 పరుగులు ఇచ్చి 4 వికెట్లను పడగొట్టారు. న్యూజిలాండ్ జట్టు టీమ్ లో సిఫెర్ట్  ఒక్కరే 52 పరుగులతో పోరాడారు. న్యూజిలాండ్ టీమ్ 19 ఓవర్లలోనే 159 పరుగులకే ఆల్ అవుట్ అయ్యింది. దీంతో అటు టీమిండియా ఫీల్డింగ్ తో బౌలింగ్ తో మ్యాచ్లో అద్భుతమైన ప్రతిభను కనబరిచారు.


అలాగే అభిషేక్ శర్మ, సంజు సాంసంగ్ మరో చరిత్ర సృష్టించారు టి20 ప్రపంచ కప్ ఫైనల్లో 50 పరుగుల భాగస్వామిని ఛేదించిన తొలి ఓపెనింగ్ జట్టుగా నిలిచారు. 2009 ప్రపంచ కప్ ఫైనల్లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ అక్మల్, షాజైబ్ మాత్రం 48 పరుగులు భాగస్వామిని ఛేదించారు. ఆ ప్రపంచకప్ పాకిస్తానీ గెలిచింది. ఇప్పుడు వాటిని బ్రేక్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: