రేషన్ కార్డులున్నవారిపై భారం.. ఏపీ ప్రభుత్వం కొత్త రూల్!
ఏ సేవకు ఎంత పెరిగింది? వంద నుంచి రెండు వందల వరకు!
గతంలో నామమాత్రంగా ఉన్న సర్వీస్ ఛార్జీలను ప్రభుత్వం భారీగా పెంచేసింది.చిన్న చిన్న సేవలకు ₹100: కొత్త రేషన్ కార్డు దరఖాస్తు, డూప్లికేట్ కార్డు తీసుకోవడం, కార్డులో సభ్యుల చేర్పు లేదా తొలగింపు, అడ్రస్ మార్పు వంటి పనులకు గతంలో కేవలం ₹24 మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు దీనిని ఏకంగా ₹100 కు పెంచేశారు.కార్డు విభజనకు ₹200: ఒకే కార్డులో ఉన్న అన్నదమ్ములు లేదా కుటుంబ సభ్యులు విడిపోయి కొత్త కార్డు తీసుకోవాలనుకుంటే (రేషన్ కార్డు విభజన), గతంలో ₹48 ఉండేది. ఇప్పుడు ఆ ఛార్జీని ఏకంగా ₹200 కి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.మీ సేవ, గ్రామ/వార్డు సచివాలయాలు, సిటిజన్ పోర్టల్ లేదా వాట్సాప్ గవర్నెన్స్.. మీరు ఏ పద్ధతిలో దరఖాస్తు చేసుకున్నా ఈ పెరిగిన ఛార్జీలు వర్తిస్తాయి.
రేషన్ పంపిణీలో పారదర్శకత కోసం...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ పంపిణీలో పారదర్శకత కోసం, అవినీతి, అక్రమాలకు తావులేకుండా ప్రక్షాళన చేసింది. కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డుల్ని ఉచితంగా పంపిణీ చేసింది. అలాగే గతంలో ఉన్న రేషన్ డోర్ డెలివరీ వ్యవస్థను రద్దు చేసి.. రేషన్ షాపుల దగ్గరకు వెళ్లి ప్రజలు సరుకులు తీసుకునేలా పాత విధానాన్ని అమలు చేస్తోంది. అయితే వృద్ధులకు మాత్రం ఇంటి దగ్గరకు సరుకులు చేరవేస్తారు. ప్రతి నెలలో పది హేను రోజుల పాటూ రేషన్ షాపులు అందుబాటులో ఉంటాయి. అలాగే ఉదయం, సాయంత్రం రేషన్ షాపులు అందుబాటులో ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ లో రేషన్ కార్డులు ఉన్నవారికి బియ్యంతో పాటుగా రాగులు, జొన్నలు గోధుమ పిండిని కూడా తక్కువ ధరకే అందిస్తున్నారు. గోధుమ పిండిని కిలో కేవలం ఇరవై రూపాయలకే అందిస్తున్నారు. అయితే వినియోగదారుల్లో కొంత శ్రద్ధ పెంచడం కోసమే ఈ ధరలను ప్రభుత్వం పెంచినట్లు కనిపిస్తుంది.