తమిళనాడులో అధికారం ఎవరిదో తేల్చేసిన కేకే సర్వే..!

Divya
తమిళనాడు రాజకీయాలలో అధికారం దక్కేదిఎవరికీ అనే విషయం ఇప్పుడు అక్కడి రాజకీయాలలో ప్రధాన అంశంగా మారింది. ప్రధాన మోదీతో సహా బీజేపీ అధినాయకత్వం తమిళనాడు ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. అందుకే వరుసగా పర్యటనలు చేస్తూ అక్కడ కొత్త వరాలను ప్రకటిస్తున్నారు. అటు సినీ హీరో టీవీకే పార్టీ అధినేత విజయ్ ఈసారి ఎన్నికలలో ఎలాంటి పాత్ర కీలకంగా మారబోతోందనే విషయంపై కేకే సర్వే సంస్థ పలు సంచలన అంచనాలను వెల్లడించింది.


తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో త్రిముఖ పోరులో ఉంటుందని, అధికారంలో ఉన్న డీఎంకే పార్టీ తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని అంచనా వేసింది కేకే సర్వే. తమిళనాడు రాష్ట్రంలో 234 నియోజకవర్గాలలో పోలింగ్ బూత్ వారీగా అభిప్రాయాలను సేకరించి ఒక అంచనా తో ఈ సర్వేను విడుదల చేసినట్లు ఆ సంస్థ సీఈఓ కిరణ్ కొండేటి తెలియజేశారు. డీఎంకే పార్టీకి 41.5% , అన్న డీఎంకే పార్టీకి 36.2%, టీవీకే పార్టీకి 13.6%, నాన్ తమిళర్ కట్చి కి 7.9% వరకు మద్దతు ఉందని కేకే సర్వే వెల్లడించారు.



ఈ సర్వేలకు కీలకమైన అంశాలను గుర్తించినట్లుగా వివరించారు. ఇప్పటివరకు సీఎం స్టాలిన్ ప్రభుత్వం చాలా అద్భుతంగా పని చేసిందని, విజయ్ పార్టీ చెన్నైలో అధిక స్థానాలకు గెలిచే అవకాశం ఉన్నట్లు తెలిపారు. తమకు ఎలాంటి పార్టీలతో సంబంధం లేవని 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో ఫలితాలకు ముందే ఎన్నికల సమయంలో  తమ సంస్థ కచ్చితంగా అంచనా వేసిందని ఆ ఎన్నికలలో కూటమి అఖండ విజయాన్ని ముందుగానే అంచనా వేశామంటూ కిరణ్ కొండేటి తెలియజేశారు. ఇప్పుడు తమిళనాడు ఎన్నికలలో కూడా తాజా అంచనాల తెలియజేయడంతో అక్కడి రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది. మరి కేకే సర్వే తెలిపిన ప్రకారం తమిళనాడులో ఏ పార్టీ విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరొక కొన్ని నెలలు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: