ఏపీ మంత్రుల‌కు చంద్ర‌బాబు రేటింగ్‌లు.. టాప్ - 4 లిస్ట్ ఇదే...!

RAMAKRISHNA S.S.
ఏపీ స‌చివాల‌యంలో బుధ‌, గురువారాల్లో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సు నిర్వ‌హిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే తొలి రోజు ముఖ్య‌మంత్రి మంత్రులకు రేటింగ్స్ ఇచ్చారు. మంత్రుల పనితీరుపై కీలక సమీక్ష నిర్వ‌హించిన ఆయ‌న మంత్రుల పనితీరుపై రేటింగ్స్ ఇచ్చారు. పాలనలో వేగం పెంచడమే లక్ష్యంగా మంత్రులకు రేటింగ్స్ ఇచ్చారు. మంత్రుల పనితీరు, వివిధ శాఖల్లో ఫైళ్ల క్లియరెన్స్ అంశం ఆధారంగా ఆయ‌న మంత్రుల‌కు రేటింగ్స్ ఇచ్చారు. ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మొదటి స్థానంలో నిలిచారు. అచ్చెన్న సీనియ‌ర్ కావ‌డంతో పాటు గ‌తంలోనూ మంత్రిగా ప‌నిచేసిన అనుభ‌వం.. శాఖ‌ల మీద పూర్తి ప‌ట్టు అన్నీ క‌లిసి ఆయ‌న‌కు ఫ‌స్ట్ ర్యాంక్ తెచ్చిపెట్టాయి. అచ్చెన్న మిగిలిన మంత్రుల క‌న్నా చాలా వేగంగా ఫైల్స్ ప‌రిష్క‌రిస్తున్నారు. .


ఇక రెండో స్థానంలో భారీ నీటిపారుదల శాఖా మంత్రి నిమ్మ‌ల రామానాయుడు నిలిచారు. మూడో స్థానంలో టీజీ భ‌ర‌త్ ఉన్నారు. నాలుగో స్థానంలో కొండపల్లి శ్రీనివాస్ ఉన్నారు. టాప్ 4 ర్యాంకుల్లో ఉన్న మంత్రుల్లో 3,4 స్థానాల్లో ఉన్న టీజీ భ‌ర‌త్‌, కొండ‌ప‌ల్లి శ్రీనివాస్ తొలిసారి ఎమ్మెల్యేలు కావ‌డం విశేషం. అందులోనూ భ‌ర‌త్ రెండోసారి పోటీ చేసి తొలిసారి అసెంబ్లీకి ఎన్నికైతే .. కొండ‌ప‌ల్లి శ్రీనివాస్ తొలి ప్ర‌య‌త్నంలోనే ఎమ్మెల్యే అవ్వ‌డంతో పాటు మంత్రి అయ్యి.. ఇప్పుడు మంచి ర్యాంక్ కొట్టేశారు ..


ఇక త‌ర్వాత స్థానంలో ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఉన్నారు. ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో అందరికంటే చివరలో హోం మంత్రి వంగలపూడి అనిత ఉన్న‌ట్టు స‌మాచారం. మంత్రులు ఫైళ్లను పెండింగ్‌లో పెట్టకుండా  నిర్ణీత సమయంలోగా క్లియర్ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. పరిపాలనలో వేగం ఉంటేనే ప్రజలకు మెరుగైన సేవలు సకాలంలో అందుతాయని, దీనిపై మంత్రులందరూ ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన సూచించారు. .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: