నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పోలీస్ శాఖలో 17వేలకు పైగా పోస్టులు భర్తీ..!

Divya
తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు పోలీస్ శాఖ తాజాగా ఒక గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే భారీగా ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ జారీ చేయబోతున్నట్లు తెలియజేశారు. పోలీసు విభాగంలో ప్రతి ఏటా కూడా పెరిగిపోతున్న ఖాళీల దృష్ట్యా ఎప్పటికప్పుడు భర్తీ చేయాలని నిర్ణయించుకుంది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2015లో 18 వేల ఉద్యోగాలు, 2018లో 18 ,428 ఉద్యోగాలు, అలాగే 2022లో 15 వేలకు పైగా పోలీసు ఉద్యోగాలను రిక్రూమెంట్ భర్తీ చేసింది.


కానీ 2026 ఫిబ్రవరి నెల నాటికి సుమారుగా ఆ శాఖలో 17 వేలకు పైగా ఉద్యోగాలు ఖాళీలు ఉన్నట్లు పోలీస్ శాఖ ప్రభుత్వానికి నివేదిక అందించింది .పోలీస్ శాఖలో మొత్తం మీద 95,361 పోస్టులు ఉండగా ఇందులో కేవలం ఇప్పుడు 77 వేల మంది పోలీసులు మాత్రమే అందుబాటులో ఉన్నారని సుమారుగా 17 వేలకు పైగా ఖాళీలు ఉన్నాయని, పోలీస్ విభాగంలో సగటున ఏడాదికి వేలల్లో రిటైర్డ్ అవుతూ ఉండడంతో ఈ ఖాళీలు ఏర్పడ్డాయని అధికారులు తెలియజేస్తున్నారు. పోలీస్ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ కూడా మిగతా వాటికంటే చాలా క్లిష్టమని, అభ్యర్థులు ప్రిలిమ్స్ ,మెయిన్స్ వంటి రాత పరీక్షలతో పాటుగా  దేహదారుడ్య పరీక్షలు కూడా నిర్వహించాలి దీంతో ఈ ప్రక్రియ కొనసాగడానికి సుమారుగా ఒక ఏడాది పైనే పడుతుంది.


అలాగే న్యాయవివాద్వాలు తోడైతే ఈ  ప్రక్రియ మరింత ఆలస్యం కూడా అవుతుంది. ఇన్ని అడ్డంకులు దాటుకొని ఎంపికైన అభ్యర్థులకు చివరిలో శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా మొత్తం మీద చూసుకుంటే సుమారుగా రెండేళ్ల సమయమే పడుతుంది. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఆలస్యం అయ్యే కొద్ది ఈ శాఖలో ఖాళీల సంఖ్య కూడా పెరుగుతున్నట్లు అధికారులు తెలియజేస్తున్నారు. వీటి భర్తీకి ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్నది. అలాగే ఎస్సై పోస్టులను జోనల్ నుంచి ఇప్పుడు రాష్ట్రస్థాయికి మార్చాలని ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: