హైదరాబాద్‌లో అత్యాధునిక చర్మ సంరక్షణ కేంద్రంగా “డిఎన్ఏ డెర్మటాలజీ & ఏస్థెటిక్స్” గ్రాండ్ ప్రారంభం

Reddy P Rajasekhar
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ చెక్ పోస్ట్ లో అత్యాధునిక చర్మ మరియు సౌందర్య చికిత్సా సేవలను అందించే డిఎన్ఏ డెర్మటాలజీ & ఏస్థెటిక్స్ క్లినిక్‌ ను ఘనంగా ప్రారంభించారు. వైద్య నిపుణులు, చర్మ సంరక్షణ, బ్యూటీ రంగ నిపుణులు హాజరయ్యారు.

డాక్టర్ ప్రియాంకా రెడ్డి స్థాపించిన డిఎన్ఏ డెర్మటాలజీ & ఏస్థెటిక్స్, ఆధునిక డెర్మటాలజీ చికిత్సలు మరియు ఏస్థెటిక్స్ సేవలను అందిస్తూ చర్మ ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం మరియు సమగ్ర ఆరోగ్యాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా పని చేయనుంది. ఈ క్లినిక్‌లో అత్యాధునిక వైద్య సాంకేతికతతో పాటు నిపుణుల సలహాలు అందిస్తూ, వైద్య మరియు సౌందర్య చర్మ సమస్యలకు వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా చికిత్సలు అందించనున్నారు.

ఈ సందర్భంగా డాక్టర్ ప్రియాంకా రెడ్డి మాట్లాడుతూ, హైదరాబాద్‌లో ఆధునిక డెర్మటాలజీ సేవలను అందించేందుకు ఈ క్లినిక్‌ను ప్రారంభించడం ఆనందంగా ఉందని తెలిపారు. శాస్త్రీయంగా నిరూపితమైన చికిత్సలు, సురక్షితమైన ఏస్థెటిక్స్ ప్రక్రియలు మరియు వ్యక్తిగత అవసరాలకు అనుగుణమైన చర్మ సంరక్షణ పరిష్కారాలను అందించడం తమ లక్ష్యమని పేర్కొన్నారు, ఎవరికి చర్మానికి ఎటువంటి ట్రీట్మెంట్స్ అవసరమో వాళ్ళ  కి తగినట్టుగా కేవలం అవసరమైనంత మేరకు మాత్రమే మనం చికిత్స అందిస్తాము.

అత్యాధునిక సౌకర్యాలతో రూపొందించిన ఈ క్లినిక్‌లో వివిధ రకాల డెర్మటాలజీ మరియు ఏస్థెటిక్స్ చికిత్సలు సమగ్రంగా అందించబడతాయి,  సౌకర్యవంతమైన మరియు ఆధునిక వాతావరణంలో నిపుణుల చేత ఉత్తమ సేవలను పొందగలుగుతారు.
హైదరాబాద్‌లో చర్మ మరియు సౌందర్య సంరక్షణలో కొత్త మైలురాయిగా నిలుస్తామని పేర్కొన్నారు.

ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా సుమారు 100 మందికి ప్రత్యేక మాస్టర్‌క్లాస్ మరియు కన్సల్టేషన్ సెషన్ ఉచితంగా నిర్వహించారు . ఈ సెషన్‌లో పాల్గొనే వారికి తాజా డెర్మటాలజీ అభివృద్ధులు, చర్మ పునరు జ్జీవనం (Skin Rejuvenation), మరియు ఆధునిక ఏస్థె టిక్స్ చికిత్సల గురించి అవగాహన చేశారు, అలాగే నిపుణులతో ప్రత్యక్షంగా మాట్లాడే అవకాశం కూడా  కల్పించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: