ఏపీ:10,600 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్.. నోటిఫికేషన్ తేదీలతో సహా..?

Divya
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్న తరుణంలో తాజాగా నిరుద్యోగులకు గుడ్ న్యూస్ తెలియజేసింది. ఉగాది పర్వదినం సందర్భంగా రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు ఉదయం ఏపీ ప్రభుత్వ జాబ్ క్యాలెండర్ ను రిలీజ్ చేశారు. వివిధ శాఖలలో ఉన్నటువంటి 10,600 పోస్టులతో సహా జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయడం జరిగింది. ఏఏ శాఖలలో ఎన్ని పోస్టులు భర్తీ చేయబోతున్నారు నోటిఫికేషన్ విడుదల తేదీ విషయంపై కూడా క్లారిటీ ఇచ్చారు.


ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. ఏపీ యువతకు ఉగాది కానుకగా ఉద్యోగాల పండుగ ప్రకటిస్తున్నామని తాను యువగళం పాదయాత్రలో జాబ్ క్యాలెండర్ ను విడుదల చేస్తానని చెప్పాను, ఆ హామీని ఇప్పుడు నెరవేర్చడం చాలా ఆనందంగా ఉందని, ప్రభుత్వ శాఖలలో 10,600 ఉద్యోగాల భర్తీకి ఏ తేదీలలో నోటిఫికేషన్ వస్తాయి ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తాము,జాబు క్యాలెండర్ ద్వారా ప్రకటించాము. అలాగే నిర్దేశిత సమయాలలో పరీక్షలు నిర్వహించే విధంగా అన్ని పోస్టులను భర్తీ చేస్తాము సిలబస్ కూడా ముందుగానే ప్రకటిస్తామంటూ తెలియజేశారు.


ఇక ప్రతి ఏడాది కూడా ఉగాదికి ఉద్యోగుల ప్రకటన ఉంటుంది అంటూ నా మాట నేను నిలబెట్టుకున్నాను ఇక మీరు పోటీ పరీక్షకు సిద్ధం అవ్వండి అంటూ నారా లోకేష్ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.

మే 15న: ఉన్నత విద్యా విభాగంలో 1500 పోస్టులకు నోటిఫికేషన్.

ఆగస్టు 15: హోం శాఖలో 2,778 పోస్టులు ఇతర శాఖలో 928 పోస్టులు, గ్రూప్ 1-91 పోస్టులకు నోటిఫికేషన్.


సెప్టెంబర్ 15న: గ్రూప్ 2 లో ఖాళీగా ఉండే 750 పోస్టులకు నోటిఫికేషన్


అక్టోబర్ 15: విద్యాశాఖలో ఖాళీగా ఉన్న 3004 పోస్టులకు నోటిఫికేషన్.

ఇందుకు సంబంధించి నారా లోకేష్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేస్తూ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: