బస్సు ప్రమాదాలపై.. ప్రశ్నిస్తున్న హీరో నిఖిల్.. ట్వీట్ వైరల్..!

Divya
రెండు తెలుగు రాష్ట్రాలలో తరచూ ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఘోర బస్సు ప్రమాదాలు జరుగుతున్నాయి. 2026 మార్చి 26 ఉదయం ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే.. ట్రావెల్ బస్ టిప్పర్ లారీ ఢీ కొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 14 మంది సజీవ దహనయ్యారు. అలాగే ఈ ఘటనలో మరో 25 మందికి తీవ్రమైన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. రెండు తెలుగు రాష్ట్ర ప్రజలను ఈ ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.


ఈ క్రమంలోనే ప్రమాదంలో మరణించిన వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం నష్ట  పరిహారం ప్రకటించింది. అయితే ఇలాంటి విషయాల పైన టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తూ ఒక ఎమోషనల్ పోస్టు షేర్ చేశారు. నాకు తెలిసి గత ఆరు నెలల్లో ఇది నాలుగో బస్సు ప్రమాదం. ఈ ఘటనలో సుమారుగా 100 మంది పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటివి జరగకుండా ఉండేందుకు కఠినమైన చర్యలు తీసుకోవాలని అధికారులు అన్ని బస్సు ట్రావెల్స్, రవాణా సంస్థలను తనిఖీ చేయాలంటూ అటు పిఎం నరేంద్ర మోడీ, కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, రెండు తెలుగు రాష్ట్ర రవాణా శాఖ మంత్రులను ట్యాగ్ చేస్తూ ఒక ట్విట్ చేశారు.

ప్రస్తుతం ఈ విషయం  సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ విషయం విన్న అభిమానులు కూడా నిఖిల్ పైన ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇలాంటివి జరిగినప్పుడు సెలబ్రిటీలు స్పందిస్తేనే ఇక మీదట ఇలాంటివి జరగకుండా ప్రభుత్వాలు తగు నిర్ణయాలు తీసుకుంటారని నేటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. నిఖిల్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం స్వయంభు అనే ఒక పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నారు ఈ సినిమా పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా ఉండబోతోంది. ఇప్పటికే చాలా భాగం  షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: