ఏపీ: వైసిపి ఓట్ షేర్ భారీగా పెరిగిందా.. జగన్ ఫుల్ హ్యాపీనేనా..?
అధికారం కోల్పోయిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అసలు ఖాళీగా ఉండకుండా క్షేత్రస్థాయిలో కేడర్ ను బలోపేతం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. సాధారణంగా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏ పార్టీకైనా సరే గ్రాఫ్ పడిపోవడం సహజమే కానీ వైసీపీ విషయంలో అందుకు పరిస్థితి భిన్నంగా కనిపిస్తోందని చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో వైసిపి ఓట్ షేర్ దాదాపుగా 8 నుంచి 10 శాతం వరకు పెరిగిందని అంతర్గత సర్వేలు సైతం చెబుతున్నాయి. అటు మాజీ సీఎం జగన్ కూడా కార్యకర్తల విషయంలో మనసు మార్చుకున్నట్లు కనిపిస్తోంది. ఇప్పుడు ఈ రెండు మార్పులు పెద్ద ఎత్తున ఏపీలో చర్చకు దారితీసిందని, గతంలో దూరమైన వర్గాలు కూడా ఇప్పుడు మళ్లీ వైసిపి వైపే మల్లుతున్నారనే విధంగా వినిపిస్తోంది.
కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న కొన్ని విధానాల పట్ల సామాన్య ప్రజలలో కూడా చాలా అసంతృప్తి మొదలైందని, ఎన్నికలలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలలో కొన్నింటిని అమలు చేయకపోవడం, అలాగే ఉద్యోగ క్యాలెండర్ అంటూ కేవలం పదివేల పోస్టులు మాత్రమే విడుదల చేయడం వల్ల చాలామంది నిరుద్యోగులు అసంతృప్తిని తెలియజేస్తున్నారు. ఇక ఉద్యోగులు కూడా అసంతృప్తితో ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా యువత, మహిళా ఓటర్లే వైసిపి పట్ల చాలా సానుకూలత పెరగడంతో పార్టీకి పెద్ద ఊరట నిచ్చే అంశమని చెబుతున్నారు. ఒకవేళ ఈ ఓట్ షేరింగ్ ఇలాగే పెరిగితే వైసీపీ పార్టీకి పూర్వ వైభవం రావడం ఖాయమని పార్టీ నేతలు కూడా ధీమా తెలియజేస్తున్నారు.