విజయవాడ టెర్రర్ లింక్ కేసులో బయటపడ్డ జీహాద్ ట్రైనింగ్ విషయాలు..!
అలా ఇప్పటికే ఆమె దాదాపుగా 42 మంది అమ్మాయిలను తన నెట్వర్క్ లోకి తీసుకున్నట్లు తెలియజేశారు. మహిళలకు స్లిప్పర్ రైఫిల్ వినియోగం , షూటింగ్ వంటి అంశాలపైన శిక్షణ ఇవ్వాలని సూచనలు కూడా అందినట్లు విచారణలో బయటపడింది." ఖావతీన్ ' అనే పేరుతో ప్రత్యేకమైన వాట్సాప్ గ్రూప్ ను నిర్వహిస్తూ మహిళలను ఒకచోట చేర్చి మరి వారిలో తీవ్రవాద భావజాలాన్ని మరింత పెంచేలా ప్రయత్నాలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. అలా ఎన్నో జీహాద్ గ్రూపులు ఆమె నిరంతరం ఆదేశాలు ఇస్తున్నట్లు తెలిపారు.
అంతేకాకుండా ఒసామా బిన్ లాడెన్, జాకీర్ నాయక్ వంటి వీడియోలను కూడా షేర్ చేస్తూ యువతలో తీవ్రవాద భావజాలాన్ని మరింత నింపేందుకు సైదా ప్రయత్నించినట్లుగా అధికారులు తెలియజేస్తున్నారు. ఇంస్టాగ్రామ్ లో సుమారుగా 40 అకౌంట్ తెరిచి జీహాద్ ప్రచారం గురించి కొనసాగిస్తున్నట్లు గుర్తించారు. వీరికి సంబంధించి ఆయుధ శిక్షణ ఇవ్వాలని ట్రైనింగ్ ప్రణాళికలను కూడా రూపొందించినట్లు ఈ విచారణలో బయట పడింది. సైదా ఉపయోగించినటువంటి వాట్సాప్ ఇంస్టాగ్రామ్ ఖాతాల నుంచి పెద్ద ఎత్తున పిడిఎఫ్ ఫైల్ లో పోలీసులు సైతం స్వాధీనం చేసుకున్నారు. ఇందులో కొన్ని బ్లాక్ పౌడర్ తయారీ, పేలుడు పదార్థానికి సంబంధించిన వంటి పదార్ధ అంశాలు కూడా వీడియో డాక్యుమెంట్ రూపంలో గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ కేసు విచారణలో మరిన్ని లింకులు బయటపడే అవకాశం ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.