నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 9,212 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్..!

Divya
కేంద్ర ప్రభుత్వం తాజాగా నిరుద్యోగులకు గుడ్ న్యూస్ తెలియజేసింది. హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) లో దేశవ్యాప్తంగా ఉన్న కానిస్టేబుల్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు మొత్తం మీద 9,212 పోస్టులకు సంబంధించి టెక్నికల్, ట్రేడ్స్ మాన్, పయనీర్ విభాగాలలో భర్తీ చేయబోతున్నారు. ఇందులో పురుషులకు 9,103 పోస్టులు ఉండగా, మహిళలకు 92 ఉన్నాయి. పయనీర్ విభాగంలో పురుషులకు 17 పోస్టులు కలవు. నిరుద్యోగులు ఎవరైనా సరే ఆసక్తి కలిగి ఉన్నవారు ఆన్లైన్ ద్వారా ఏప్రిల్ 20, 2026 లోపు దరఖాస్తు చేసుకోవాలి.


అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సిన వారు కచ్చితంగా మెట్రిక్యులేషన్ లేదా పదవ తరగతి పాస్ అయి ఉండాలి. అలాగే సంబంధిత ట్రేడ్లలో నైపుణ్యం కూడా కలిగి ఉండాలి.


డ్రైవర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 21 నుంచి 27 ఏళ్ల మధ్య కలిగి ఉండాలి. (1999 జనవరి2 కంటే ముందు, 1జనవరి  2005 తర్వాత జన్మించి ఉండకూడదు)

మెకానిక్ వెహికల్, కుక్,  టెయిలర్ , బార్బర్, సఫాయి, కార్పెంటర్ పోస్టులకు 18 నుంచి 23 ఏళ్ల మధ్య వయసు కలిగి ఉండాలి. (2003 జనవరి 2 కంటే ముందు, 2008 జనవరి1 తర్వాత జన్మించి ఉండకూడదు) ఎస్సీ,ఎస్టీ, లకు ఐదు సంవత్సరాలు, ఓబిసి, ఈడబ్ల్యూ అభ్యర్థులకు వయోపరిమితిలో మూడేళ్లు సడలింపు


అర్హత కలిగిన అభ్యర్థులు ఎవరైనా సరే 19 మే 2026 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు జనరల్ ఈడబ్ల్యూఎస్, ఓబిసి, పురుష అభ్యర్థులు  రూ.100 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, మాజీ సైకోద్యోగులకు ఎటువంటి ఫీజు ఉండదు.


ఆన్లైన్ రాత పరీక్ష, పీఈటి, పిఎస్టి పరీక్షల ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. ఇక ఎంపికైన అభ్యర్థులకు జీతభత్యాల విషయానికి వస్తే.. రూ.21,700 నుంచి రూ.69,100 జీతం చెల్లిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: