ఆన్లైన్ మోసాలకు చెక్.. ఆర్బిఐ సరికొత్త ప్లాన్..!

Divya
ఈమధ్య ఆన్లైన్  మోసాలకు చాలామంది ప్రజలు గురవుతున్నారు. అయితే ఈ మోసాలకు అడ్డుకట్ట వేయడానికి ఆర్బిఐ ఒక కొత్త ప్లాన్ వేసింది. ఇకపై మీరు ఎవరికైనా సరే ఫోన్ పే లేదా నెట్ బ్యాంకింగ్ , మరే ఇతర ద్వారా పేమెంట్  రూ.10 వేల రూపాయల కంటే ఎక్కువగా పంపించినట్లు అయితే ఆ డబ్బు వెంటనే అవతలి వారికి చేరదట. కనీసం ఆ డబ్బు చేరడానికి ఒక గంట పాటు సమయం పడుతుందని ఆ డబ్బు హాల్డ్ లోనే ఉంటుందని ఈ లోపు మీకు ఏదైనా అనుమానం వచ్చిన లేకపోతే పొరపాటుగా ఎవరికైనా పంపించామని అనిపించిన ఆ ట్రాన్సాక్షన్ ను వెంటనే క్యాన్సిల్ చేసుకొనే సదుపాయంతో రాబోతోంది.


దీనివల్ల సైబర్ నేరగాళ్ల నుంచి బయటపడవచ్చని, అలా డబ్బులు వారి ఖాతాలో పడక ముందే గంటలోపు మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. ప్రస్తుతం జరుగుతున్న పెద్దపెద్ద మోసాలన్నీ కూడా పదివేల రూపాయలకు పైబడిన లావాదేవులలోనే ఉన్నాయని గుర్తించి ఆర్బిఐ ఈ నిర్ణయం తీసుకుంది. దివ్యాంగులను, ముసలివారిని టార్గెట్ చేసుకొని సైబర్ నేరగాళ్లు పాల్పడుతున్నారని ఆర్బిఐ గుర్తించి వారికోసం నమ్మకస్తుడైన ఒక వ్యక్తిని రక్షణను తీసుకువస్తోంది. అంటే దీని ప్రకారం వృద్ధులు రూ.50 వేల రూపాయల కంటే ఎక్కువ డబ్బులు ఎవరికైనా సరే పంపించాలి అంటే వారు ముందుగా ఎంటర్ చేసుకున్న ఆ నమ్మకమైన వ్యక్తి కూడా ఆ పేమెంట్ ని ఓకే చేయాల్సి ఉంటుంది.

అలాగే మీ అకౌంట్లో ఏదైనా తేడా జరుగుతోంది అనిపిస్తే ఒక సెకనులో మీ డిజిటల్ సేవలు అన్ని కూడా ఆపేసే కిల్ స్విచ్ అనే బటన్ ని కూడా బ్యాంకులు అందుబాటులోకి తీసుకువచ్చేలా చేస్తున్నారట. అలా ఒక్కసారి క్లిక్ చేస్తే చాలు మీ అకౌంట్ నుంచి ఒక్క రూపాయి కూడా కాజేయలేరు. అయితే మనం షాపులలో కొనే సామాన్లు లేదా కరెంట్ బిల్ ,ఇన్సూరెన్స్ వంటివి కట్టే వాటికి మినహాయింపు ఉంటుంది. మీరు నమ్మకంగా కలిగిన వారి కొంతమంది పేర్లను లిస్టులో పెట్టుకున్న వారికి కూడా వెంటనే అమౌంట్ పడిపోతుంది. అలాగే ఏడాదికి రూ .25 లక్షల రూపాయల కంటే ఎక్కువ డబ్బులు అకౌంట్ లోకి వస్తే ఆ ఖాతాను తనిఖీ చేయబడుతుంది. ఈ కొత్త రూల్స్ కోసం మే 8వ తేదీ వరకు ప్రజల సలహా తీసుకోవాలని ఆ తర్వాతే వాటిని అమలు చేయాలని ఆర్బీఐ భావిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: