అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి.. గొప్ప మనసు చాటుకున్న బాలయ్య..!
హిందూపురం నియోజకవర్గం లేపాక్షి గ్రామం నటరాజు దంపతులకు కుమారుడు కేయాన్స్ అడ్విక్ వయసు రెండు సంవత్సరాలు అయినా స్పైనల్ మస్క్యులర్ ఆట్రోఫీ టైప్ 2 తో బాధపడుతున్నారట. దీంతో కుటుంబ సభ్యులు చికిత్స అందిస్తున్నప్పటికీ ఈ వ్యాధికి అవసరమైన జీవరక్షణ ఔషధం AVXS -101 అనే మెడిసిన్ ఇండియాలో తయారు కావడంలేదని దీని ఇంజక్షన్ ధర రూ .16 కోట్ల రూపాయలు అంటూ బెంగళూరు బాఫ్టిస్ట్ హాస్పిటల్ వైద్యులు నిర్ధారించారు. బిడ్డ ప్రాణాలు దక్కాలి అంటే రూ .16 కోట్ల రూపాయలు సర్దుబాటు చేసుకోవాలని చెప్పారట. అంత డబ్బు సర్దుబాటు చేయలేక తల్లితండ్రులు ఇబ్బందులు పడుతున్నారు.
ఈ క్రమంలోనే హిందూపురం పర్యటనలో ఉన్న బాలకృష్ణ ను ఆ కుటుంబ తల్లిదండ్రులు కలవగా ఆ బిడ్డ పరిస్థితిని వివరించగా బిడ్డ చికిత్స కోసం తన వంతు సహాయం చేస్తున్నానని, ప్రభుత్వ పరంగా కూడా ప్రయత్నం చేస్తానని ఎమ్మెల్యే బాలకృష్ణ హామీ ఇచ్చారు. ఇంత భారీ మొత్తంలో డబ్బుని సమకూర్చే పరిస్థితులలో ఆ కుటుంబం లేకపోవడం వల్ల ప్రతి ఒక్కరూ కూడా మానవత దృక్పథంతో తమ వంతు సహాయంగా ఆ చిన్నారి భవితకు బాటలు వేసేలా అడుగు వేయాలంటూ బాలయ్య విజ్ఞప్తి చేశారు. అందుకు సంబంధించి పూర్తి వివరాలతో ఒక ప్రకటన కూడా తెలియజేశారు. కొన ఊపిరితో ఉన్న ఆ చిన్నారిని కాపాడుకుందాం అంటూ పిలుపునిచ్చారు. ఇందుకు సంబంధించి ఒక పోస్ట్ కూడా వైరల్ గా మారింది.