ఏపీ: గుడ్ న్యూస్ చెప్పిన కూటమి ప్రభుత్వం.. ఖాతాలో రూ. 20 వేలు..!

Divya
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు సారధ్యంలోనే ఇప్పుడు కూటమి ప్రభుత్వం పలు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తుంది. ఏపీలో అన్ని వర్గాల ప్రజల ఆర్థిక అభివృద్ధి కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తోంది కూటమి ప్రభుత్వం. ఇందులో భాగంగానే ఇప్పుడు తాజాగా మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ తెలియజేసింది. అర్హత కలిగిన ప్రతి మత్స్యకార కుటుంబానికి ప్రతి ఏడాది రూ .20వేల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయాన్ని అందజేసేలా ప్లాన్ చేస్తున్నారు.


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మత్స్యకార కుటుంబాలు చాలానే ఉన్నాయి. వారికోసం ప్రత్యేకించి ప్రభుత్వం సంక్షేమనికి పెద్దపీట వేస్తోంది. సముద్రం పైన ఆధారపడి జీవించే వేలాదిమంది మత్స్యకారుల ఆర్థిక భద్రతను దృష్టిలో ఉంచుకొని, ప్రతి ఏడాది కూడా వేట నిషేధ సమయంలో వారికి ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ఇప్పుడు అర్హత కలిగిన మత్స్యకార కుటుంబానికి రూ .20వేల రూపాయలు అందించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించుకుంది. ప్రతి ఏడాది వేసవిలో 61 రోజులపాటు సముద్రంలో చేపలు వేటాడడం నిషేధం . ఈ 61 రోజుల కాలంలో మత్స్యకారులకు జీవనోపాదికి  ఇబ్బంది కలగకుండా ఉండేందుకు వారి కుటుంబాలు ఆనందంగా జీవించడానికి రూ .20వేల రూపాయల చొప్పున అందిస్తోంది.


అలా 2026 సంవత్సరానికి గాను జూన్ 14వ తేదీన సముద్రంలో చేపల వేట నిషేధం అమలు కాబోతూ ఉండడంతో, మత్స్యకారుల బ్యాంకు ఖాతాలో ప్రభుత్వం 20వేల రూపాయలు జమ చేయనుంది. ప్రస్తుతం తీర ప్రాంత గ్రామాలలో ఉండే లబ్ధిదారుల ఎంపిక జరుగుతోందని అనంతరం మత్స్యకారుల అధికారుల క్షేత్రస్థాయిలో కూడా దరఖాస్తులను పరిశీలించబోతున్నారని, అర్హులను గుర్తించి ఎంపికైన వారి జాబితాను అందరికీ తెలిసేలా సచివాలయాలలో లిస్ట్ విడుదల చేయబోతున్నారు.

ఈ పథకానికి అర్హులు కావాలి అంటే మత్స్యకార గుర్తింపు కార్డు ఉండాలి, ఆధార్ కార్డ్, బోటుకు సంబంధించిన లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్, బ్యాంకు పాసుబుక్ 18 నుంచి 60 సంవత్సరాలు వయసు కలిగి ఉన్న వారు మాత్రమే ఈ పథకానికి అర్హులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: