ఏపీ: నిరాహార దీక్ష చేపట్టిన వైసిపి మాజీ మంత్రి..!

Divya
వైసిపి నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు తాజాగా నిరాహార దీక్ష చేపట్టారు. ఇటీవల గుంటూరులో తన ఇల్లు కార్యాలయం పైన జరిగిన దాడి ఘటన పైన తీసుకోవాలని,ఆ దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని, పోలీసుల అధికారుల పైన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తూ గుంటూరు కలెక్టరేట్ వద్ద ఉదయం ఆరు గంటలకు నిరాహార దీక్షను ప్రారంభించారు. అంబాటి రాంబాబు దీక్షకు ఎమ్మెల్సీ అప్పిరెడ్డి తోపాటు మరి కొంతమంది వైసీపీ నేతలు కూడా మద్దతు తెలియజేశారు.



ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన ఇల్లు ఆఫీసు పైన అత్యంత దారుణంగా దాడి చేశారని, కార్లు ఫర్నిచర్స్ ధ్వజం చేశారని అసభ్య పదజాలంతో దూషించారంటూ ఆరోపణలు చేశారు. ఇదంతా కూడా పోలీసుల సమక్షంలోనే జరిగిందంటూ తెలియజేశారు. అయితే తాను చంద్రబాబు నాయుడుని దూషించాననే ఆరోపణలతో 18 రోజులపాటు జైల్లో ఉంచారు అయితే తన ఇంటి పై దాడి చేసిన వారిని కనీసం 18 నిమిషాలైనా కూడా జైలులోకి పంపించలేరా అంటూ ప్రశ్నించారు. ఇప్పటికైనా తన ఇంటి మీద దాడి చేసిన వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి  డిమాండ్ చేస్తున్నారు.



అంతేకాకుండా తనని అరెస్టు చేసి అనంతరం నల్లపాడు పోలీస్స్టేషన్లో తనని హింసించేందుకే ప్రయత్నాలు చేశారని కస్టోడియట్ టార్చర్ పైన ఇప్పటివరకు కూడా ఎటువంటి చర్యలు లేవని విమర్శించారు. ఈ దాడి వెనుక పెమ్మసాని చంద్రశేఖర్ తో పాటు నారా లోకేష్ హస్తం ఉందంటూ పలు రకాల ఆరోపణలు చేశారు. ఈ దాడికి పాల్పడిన వారిని ఎవరిని కూడా వదిలిపెట్టనని, వారిని జైలుకు పంపించే వరకు తన పోరాటం ఆగదు అంటూ తెలిపారు. తనను భయపెట్టాలనుకుంటే అది వారి పొరపాటేనని చట్టబద్ధంగా వ్యవహరించాలని , ప్రాణాలకు తెగించైనా సరే చట్టపరంగా మీ అంతు తేలుస్తానంటూ తెలియజేశారు అంబాటి రాంబాబు. తాను చేస్తున్నది ధర్మపోరాటమెనని ,ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఇలాంటి దుర్మార్గమైన పాలనకు మద్దతు ఇస్తున్నారు అంటూ విమర్శించారు వైసీపీ నేత.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: