ఏపీలో బంగారు గనులు.. బంగారం ధరలు తగ్గుతాయా..?
అయితే ఈ ప్లాంట్ ద్వారా మొదటి ఏడాది 400 కిలోల బంగారాన్ని ఉత్పత్తి చేసేలా ప్లాన్ చేశారు. వచ్చే ఏడాది నుంచి 900 కిలోల బంగారాన్ని ఉత్పత్తి చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా ప్రతి ఏడాది పెంచుతూ రెండు టన్నుల వరకు ఈ బంగారాన్ని ఉత్పత్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు. అలాగే ఈ ప్లాంట్ ద్వారా కూడా సుమారుగా 1000 మందికి పైగా ఉపాధి లభించే అవకాశాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఈ బంగారు గనుల పేరు వినిపిస్తున్నప్పటి నుంచి బంగారం ఉత్పత్తి ప్రారంభమైతే ఏపీలో బంగారం ధరలు తగ్గుతాయి అనే చర్చ కూడా ఇప్పుడు మొదలైంది.
కానీ ఈ విషయం పైన నిపుణులు మాత్రం అలాంటి పరిస్థితులు ఏవి ఉండవంటూ తెలియజేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ గోల్డ్ ప్రాజెక్టు ద్వారా ఎంత మేర బంగారం ఉత్పత్తి అవుతుందనే విషయం పైన ఇంకా సరైన స్పష్టత అనేది రాలేదు. ప్రతి ఏడాది భారత్ 700 నుంచి 800 టన్నుల బంగారాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఈ డిమాండ్ వల్లే ఇప్పుడు జొన్నగిరి నుంచి బంగారం వెలికి తీయబోతున్నట్లు విశ్లేషకులు తెలియజేస్తున్నారు. దీనివల్ల బంగారం దిగుమతులు కూడా గణనీయంగా తగ్గించే అవకాశం ఉంటుందని, అలాగే ధరల పైన ప్రభావం చూపే అవకాశం కూడా ఉంటుందనే విధంగా విశ్లేషకులు తెలియజేస్తున్నారు. ఏం జరుగుతుందో తెలియాలంటే మరో కొద్ది రోజులు ఆగాల్సిందే.