విజయ్ మాల్యా ఋణాలు భారత బ్యాంకులు రాబట్టుకోవచ్చు: బ్రిటన్ న్యాయస్థానం

పదుల సంఖ్యలో భారతీయ బ్యాంకుల‌కు వేల‌ కోట్లు ఎగనామం పెట్టి విదేశాలల్లో తల‌దాచు కుంటున్న విలాస‌ పురుషుడు లిక్కర్ టైకూన్ విజ‌య్ మాల్యాకు బ్రిటన్ న్యాయస్థానం లో ఎదురు దెబ్బ త‌గిలింది. భార‌త బ్యాంకులు విజయ్ మాల్యాకు ఇచ్చిన మొత్తాన్ని వసూల్ చేసుకునేందుకు వీలు క‌ల్పించింది. ఇప్ప‌టికే "డెట్ రిక‌వ‌రీ ట్రైబ్యున‌ల్-డి ఆర్ టీ" బ్యాంకుల‌కు విజయ్ మాల్యా ₹.6203,35,03,879.42 ను వ‌డ్డీతో స‌హా చెల్లించాల‌ని ఇది వ‌ర‌కే ఆదేశాలు జారీ చేసింది.  




ఈ నేప‌థ్యం లో లండ‌న్ లో త‌ల‌దాచుకుంటూ తాను మాత్రం అమాయకుణ్ని బాంకులే తనని ఇబ్బందులు పెడుతున్నా యని ప్ర‌చారం చేసుకుంటున్న విజ‌య్ మాల్యా కు బ్రిట‌న్ కోర్టు బలమైన ఊహించని షాకిచ్చింది. విజయ్ మాల్యాకు రుణాలు ఇచ్చిన ఇండియ‌న్ బ్యాంకుల కన్సార్టియం లండన్ కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసింది. ఈ పిటిష‌న్ పై విచార‌ణ చేసిన బ్రిట‌న్ కోర్టు జ‌డ్జి 'ఆండ్రూస్ హెన్షా' విజయ్ మాల్యా ఉద్దేశ పూర్వ‌కంగా బ్యాంకుల్లో పొందిన రుణాల్ని తిరిగి చెల్లించ‌కుండా ఎగ్గొట్టార‌ని నిర్ధారించారు. ఉద్దేశపూర్వ ఋణ ఎగవేత దారులనుండి బ్యాంకులకు సొమ్ము రాబట్టుకునే హక్కుందని అన్నారు. 


ఆయనపై 13బ్యాంకులు పిటిషన్ దాఖలు చేయగా 13 బ్యాంకుల‌కు అనుకూలంగా భార‌త కోర్టు ఇచ్చిన ఆదేశాల‌ను జ‌డ్జి స‌మ‌ర్థించారు. దీంతో ఇంగ్లండ్ వేల్స్‌లో విజయ్ మాల్యాకు ఉన్న ఆస్తుల‌ను స్వాధీనం చేసుకునేందుకు మ‌న దేశ బ్యాంకు ల‌కు అవకాశం ద‌క్కింది. 




అంతేకాదు, లండన్ న్యాయస్థానం క్వీన్స్ బెంచ్ - విజయ్ మాల్యా ఋణం అందించిన 13 భారతీయ బ్యాంకులు త‌మ సొమ్ము ను తిరిగి రాబ‌ట్టుకునేందుకు అవకాశం క‌ల్పించారు.


The London court ruling is seen as a legal victory for a consortium of Indian banks seeking to recover £1.145 billion worth of assets. (Queens Bench) 


దీంతో లండ‌న్ లో ఉన్న విజయ్ మాల్యా వ‌ద్ద తాముఇచ్చిన రుణాల్ని ముక్కుపిండి మరీ వ‌సూలుచేసుకునేందుకు ఇండియా కు చెందిన 13బ్యాంకులు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నాయి. ఇది భారత బాంకులకు, ప్రభుత్వానికి అద్భుత విజయమనే చెప్పాలి.

బ్రిటన్ కోర్ట్ తన తీర్పు ద్వారా ఇచ్చిన కొత్త సందేశం ఉద్దేశ పూర్వ‌క ఋణ ఎగవేతదారుల ప్రపంచదేశాల్లోని ఎక్కడి ఆస్తుల నైనా ఫ్రీజ్ చేసే కొంగ్రొత్త సాంప్రదాయాలకు శ్రీకారం చుట్టిందనే చెప్పొచ్చు. ఇక ఉద్దేశపూర్వక ఋణ ఏగవేతదారులకు కాలం మూడినట్లే అనుకోవాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: