పార్టీ పగ్గాలు యువరాజుకి, శాంతి భద్రతలు మహా మంత్రికి, సామ్రాట్ జైత్ర యాత్రలకు-ఇదీ పరిస్థితి

డిసెంబర్ 7 ఎన్నికలు జరిగి పలితాలు 11 న వెలువడి దేశంలోనే అత్యంత ఆధిఖ్యతతో తెలంగాణా ప్రజలు కలవకుంట్ల చంద్రశేఖర రావు నాయకత్వంలోని "తెలంగాణా రాష్ట్ర సమితి" (టీఆరెస్) కి పట్టం కట్టారు. అయితే దాదాపు రెండువారాలు గడచిపోయినా రాజ్యాంగ వ్యవస్థలు ఏర్పడలేదు. ఒక్క ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేయగానే సరిపోయిందా? శాసనసభ ఏర్పడలేదు, మంత్రివర్గం ఏర్పరచలేదు  అంటే ఇక్కడ ఇప్పుడు రాజ్యాంగబద్ద పాలన లేదనేగా అర్ధం. ఇప్పుడు రెండు మూడు వారాలు నడిచేది నడవనుంది "దొరగారి కుటుంబ పాలన" అనేగా అర్ధం. దొరేమో రాజ్య విస్థరణకు జైత్ర యాత్రలకు వెళ్ళారు. చట్టబద్ధమైన సంపూర్ణ మంత్రివర్గ ప్రమాణ స్వీకారం చేయటం ప్రజాస్వామ్య ధర్మం. తెలంగాణాతో పాటు ఎన్నికలు జరిగిన అన్నీ రాష్ట్రల్లో వారం రోజులలోపే పరిపాలన ప్రారంభమైంది.  
  

దేశ రాజ‌కీయాల్లో ఇప్పుడు ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తోంది. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్య‌మంత్రి కేసీఆర్ నాలుగున్న‌రేళ్ల పాల‌నకు మించిన తీరులో రానున్న రోజుల్లో పాల‌న సాగ‌నుంద‌న్న మాట ప‌లువురి నోట వినిపిస్తోంది. ఎన్నిక‌ల ఫ‌లితాలు వెల్ల‌డైన వెంట‌నే ఎన్నికైన ప్ర‌జాప్ర‌తి నిధులు ప్ర‌మాణ‌ స్వీకారం చేయ‌టం రాజ్యాంగ సాంప్రదాయం.  


అందుకు భిన్నంగా, తాను త‌న‌కు న‌చ్చిన ఇద్ద‌రు వ్యక్తులతో ప్రమాణం చేయించి  ఆయనకు రాజ్యాన్ని అప్పగించి మిగిలిన వారంతా ప్ర‌మాణ‌ స్వీకారం చేయ‌టానికి కూడా ఇష్ట‌ప‌డ‌ని ముఖ్య‌మంత్రి దేశంలో కేసీఆర్ త‌ప్పించి మ‌రెవ‌రూ ఉండ‌రంటున్నారు.


కాంగ్రెస్ ఈ విషయంపై ఎలాంటి రాజ్యాంగబద్ధతను ప్రశ్నించే సామర్ధ్యం లేనిదై పోగా రాష్ట్రంలో చట్టం చట్టుబండలైంది. ఇప్పుడు దొరవారి సేనాని హోం మంత్రిగా తన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అంటే శాంతి భద్రతలకు ఢొకా లేదు కాని మిగిలిన వ్యవస్థలు అవస్థలపాలైనా ఫరవాలేదా? శాసనమండలిలో ప్రతిపక్షం శూన్యం అయింది. తెలుగుదేశం శాసనసభాపక్షం హారతి కర్పూరం అవనుంది. కాంగ్రెస్ శాసనసభాపక్షం మగతనం లేకుండా నిక్కీ నీల్గుతుంది. క్రమంగా కాంగ్రెస్ ష్రింక్ అయి పోతుంది. తెలంగాణాలో ముందురానున్న పాలన ఎమిటో తెలుస్తూనే ఉంది. ఎలా ఉండబోతోందో రూపురేఖలు అర్ధమౌతూనే ఉన్నాయి. పార్టీని యువరాజుకి పాలనను సేనాధిపతికి అప్పగించి ప్రక్కరాజ్యాలపై దండయాత్రలకు, తీర్ధయాత్రలకు వెళ్ళిన చక్రవర్తి లా మన దొర ప్రవర్తిస్తున్నారు. రాజవారు జైత్ర యాత్రలు పూర్తి చేసుకొని రాగానే పాలన మొదలౌతుందన్న మాట.    


స్వాతంత్య్రం వ‌చ్చిన 70 ఏళ్ల‌లో దేశంలో ఇన్ని రాష్ట్రాలున్నా ఒక‌సారి ఎన్నిక‌లు ముగిసి, భారీ మెజార్టీని మూట‌క‌ట్టుకున్న పార్టీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసి కూడా ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన ఎమ్మెల్యేల చేత ప్ర‌మాణ స్వీకారం చేయించ‌ని ఘ‌న‌త కేసీఆర్ సొంతంగా చెబుతున్నారు.

 

మొత్తం 119 స్థానాల‌కు 88 స్థానాల్ని సొంతం చేసుకొని మ‌రో ఇద్ద‌రు ఇప్ప‌టికే పార్టీలో చేరిన త‌ర్వాత కూడా ఎమ్మెల్యేల ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వం ఎప్పుడున్న విష‌యం ప్ర‌జాప్ర‌తినిదుల‌కు కూడా తెలియని చిత్ర‌మైన ప‌రిస్థితి కేసీఆర్ కు మాత్ర‌మే సాధ్య‌మంటున్నారు.


ఎన్నిక‌లు అయిన వెంట‌నే ప్ర‌జాప్ర‌తినిధుల చేత ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌టం అసెంబ్లీ కొలువు తీర‌టం లాంటివి వెంట‌వెంట‌నే జ‌రిగే ప‌రిణామాల‌ని కానీ, అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రించే ద‌మ్ము, ధైర్యం దేశంలో మ‌రే ముఖ్యమంత్రికి లేద‌ని, అది మొత్తంగా కేసీఆర్‌కు మాత్ర‌మే సాధ్య‌మంటున్నారు. ఆయ‌న‌ కానీ ఆయ‌న వార‌సులు మాత్ర‌మే ఇలాంటివి చేయ‌గ‌లుగుతార‌ని చెబుతున్నారు. 

ఎన్నిక‌ల్లో గెలిచి ఎమ్మెల్యేలుగా చెప్పుకుంటున్నా వారాల త‌ర‌బ‌డి ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌కుండా ఉండ‌టం కేసీఆర్‌కే చెల్లు అని చెప్ప‌క త‌ప్ప‌దు. తెలంగాణాలో వారాలు గడుస్తున్నా శాసన సభ ఏర్పడ లేదు - రాజ్యాంగం దొర ముందు నిక్కి-నీల్గు తుందా? ప్రజాస్వామ్యం తెలంగాణాలో కునారిల్లనుందా? 

 

పార్టీ పగ్గాలు యువరాజుకి, శాంతి భద్రతలు మహా మంత్రికి, సామ్రాట్ జైత్ర యాత్రలకు-ఇదీ తెలంగాణా రాష్ట్ర పరిస్థితి. ప్రజా స్వామ్యం కలికానికి కూడా కనిపించదు. ప్రజలిచ్చిన ఆధిఖ్యతతో రాజ్యాంగం దొర పాదాక్రాంతమేనా?  తెలంగాణాలో కుటుంబ రాజ్యపాలన అనేది తెలంగాణా ఎన్నికల వేళ,  ఏపి ముఖ్యమంత్రి పాదం పేట్టటంతో ఈ దౌర్భాగ్యం సిద్ధించింది ప్రతిపక్షాలకు అధికారం ఇస్తే రేపు ప్రభుత్వాలు ఇలాగే తగలడతాయి అంటున్నారు ముక్తకంఠంతో  ప్రజలు, రాజకీయవేత్తలు, విశ్లేషకులు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: