ప్రత్యేక సర్వే: రాజమండ్రి ఎంపీగా గెలిచేదెవరు..?

Chakravarthi Kalyan
ఏపీ రాజకీయాల్లో వేడి పెరిగింది. నేతల మాటల తూటాలు పేలుతున్నాయి. విమర్శల జడివాన కురుస్తోంది. ఆంధ్రాలో ఎక్కడ చూసినా ఒకటే చర్చ.. కాబోయే సీఎం ఎవరు మళ్లీ చంద్రబాబేనా.. లేక జనం ఈసారి జగన్‌ కు పట్టం కడతారా అన్న ఆత్రుత, ఆసక్తి అందరిలోనూ ఉన్నాయి. 



ఈ ఉత్కంఠకు కాస్త తెరదించేందుకు అనేక సర్వే సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఓ సర్వే సంస్థ ఆంధ్రావ్యాప్తంగా 100 నియోజకవర్గాలు సర్వే చేసింది. ఆ సర్వే రిపోర్టు ఆధారంగా రాజమండ్రితో పాటు 15 ఎంపీ నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారనే అంశంపై ఓ అంచనాకు వచ్చింది.




కాకినాడ విషయానికి వస్తే.. ఇక్కడ ప్రధాన పార్టీలు మూడూ బరిలో ఉన్నాయి. రాజమండ్రి నియోజకవర్గంలో అనపర్తి, రాజానగరం, రాజమండ్రి నగరం, రాజమండ్రి రూరల్‌, కొవ్వూరు , నిదడవోలు, గోపాలపురం నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో కొవ్వూరు, గోపాలపురం ఎస్సీ రిజర్వుడు స్థానాలు. ఈ సర్వే ప్రకారం రాజమండ్రిలో వైసీపీ చాలా బలంగా ఉంది. 



వైసీపీ ప్రధమ స్థానంలో ఉండగా.. సెకండ్ ప్లేస్ కోసం టీడీపీ, జనసేన హోరాహోరీగా తలపడుతున్నాయట. ఐతే.. ఈ రెండు పార్టీలూ వైసీపీకి ఆమడ దూరంలో ఉండటంతో ఇక్కడ వైసీపీ గెలుపు నూటికి నూరుశాతం ఖాయంగా తెలుస్తోంది. మెజారటీ 50 వేల నుంచి లక్ష ఓట్ల వరకూ ఉండొచ్చని ఓ అంచనా. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: