ఎగ్జిట్‌ - పోల్స్‌ ప్రభావం: చంద్రమాయ నుండి బయటపడ్ద మాయావతి

కేంద్రంలో మళ్లీ ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రానుందని ఎగ్జిట్‌ పోల్స్‌ స్పష్టం చేయడంతో విపక్షాలు జావగారి పోతున్నాయి. ఎగ్జిట్‌-పోల్స్‌ ఫలితాల వెల్లడితో హస్తినలో ఒక్కసారిగా రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరియు యూపీఏ చైర్పన్ సోనియా గాంధీ తో నేడు హస్తినలో జరగాల్సిన భేటిని బహుజన సమాజ్‌ వాదీ పార్టీ అధినేత్రి మాయావతి రద్దు చేసుకున్నారు.

మాయావతి ఈ రోజు ఢిల్లీకి రావడం లేదని, లక్నో లోనే ఉంటారని బీఎస్పీ నేత ఎస్సీ మిశ్రా తెలిపారు. ఈ ఉన్నత స్థాయి సమావేశాన్ని అటు మాయావతిని ఒప్పించి ఇటూ అష్టకస్టాలు పడి సోనియా గాంధిని సమాధాన పరచి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి టిడిపి అధినేత ఏర్పాటు చేశారు.శనివారం లక్నోలో మాయావతి తో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చర్చలు జరిపారు.

ఈరోజు కూడా ఢిల్లీలో మాయావతిని ఆయన కలవనున్నారని టీడీపీ వర్గాలు తెలిపాయి. మాయావతి ఢిల్లీ పర్యటన రద్దు చేసుకోవడంతో చంద్రబాబు హస్తిన పర్యటన కూడా సందిగ్ధంలో పడినట్టు సమాచారం. కొందరు తెలుగు సినిమా హీరోయిన్స్ లెగ్గులాగా - చంద్రబాబు లెగ్గెట్టి - ఏర్పాటు చేసిన సోనియా మాయావతి తొలి భేటీ - రద్ధైపోయినట్లే. 

ఉత్తర ప్రదేశ్‌లోని మొత్తం 80 సీట్లలో బీజేపీకి గరిష్టంగా 57 స్థానాల వరకు రావొచ్చని ఎగ్జిట్‌-పోల్స్‌ వెల్లడించాయి. మహాకూటమికి 40 సీట్లు దాకా వచ్చే అవకాశముందని తెలిపాయి. కాంగ్రెస్‌కు రెండు సీట్లు వస్తాయని అంచనా వేశాయి. ఈ పలితాల దెబ్బకి మాయావతి ధిమ్మ తిరిగిపోయి ఆమెకు బొమ్మ కనిపించిందట. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: