"చివరికి సింగిల్ గా మిగిలేది చంద్రబాబే!" ఎన్డీఏ శివసేన చురకలు

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుణ్ణి,  2014 లో భారతీయ జనతా పార్టీ తో జతకట్టి ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామి అవ్వమని ఏ ఇతర బీజేపి ప్రతిపక్షం కోరలేదు. ఆయన అవసరార్ధం ఎండీఏ లో భాగస్వామిగా మారి నాలుగేళ్లు తనివి తీర అధికారం అనుభవించి ఆ నాలుగేళ్లలో ప్రధాని నరేంద్ర మోడీని నమో అంటూ పూజించి, వందల సార్లు పొగిడి, మోడీని, పార్టీ ప్రముఖుడైన ముత్తవరపు వెంకయ్య నాయుణ్ణి ఇంకొందర్ని సన్మానించిన సందర్భాన్ని మరచి తన స్వార్ధ ప్రయోజనాలకు భంగం కలగగానే "పచ్చని ఎన్దీఏ" ని కూలచటానికి ఎన్డీఏ నుండి బయటకు వచ్చి, చివరకు తనకు తనపార్టీకి ఆగర్భ శత్రువు కాంగ్రెస్ తో సిగ్గు విడిచి చేతులు కలిపి, బీజేపి పతనమే ధ్యేయంగా "ప్రతిపక్షాల ఐఖ్యత అంటూ రాష్ట్ర పాలన వదిలేసి దేశం మీద పడ్దాడు. 

అవసరం తీరిన తరవాత అవసరంలో ఆదుకున్నవాళ్ళను వదిలేసే నైజమున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కేంద్రంలో విపక్షాలను ఏకం చేసి, ఎన్డీయేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను ఎన్డీయే భాగస్వామి, మిత్రపక్షం శివసేన ఎద్దేవా చేసింది. కేంద్రంలో ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేస్తార న్న ప్రశ్నకు ఇప్పటికే సమాధానం లభించిందని తమ పత్రిక ‘సామ్నా’లో రాసిన సంపాదకీయంలో శివసేన పేర్కొంది. 


"ప్రధాని పదవికి ప్రతిపక్షంలో కనీసం ఐదుగురు పోటీదారులు ఉన్నారు. కానీ వీరి కలలు కల్లలయ్యే అవకాశాలే ఎక్కువగా కనబడుతున్నాయి. కేంద్రంలో ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారన్న ప్రశ్నకు ఇప్పటికే జవాబు దొరికింది. బీజేపీ 300 సీట్లు గెలుస్తుందని అమిత్‌ షా ముందే చెప్పారు. ఐదో విడత ఎన్నికలు ముగిసేసరికే బీజేపీ తన లక్ష్యాన్ని చేరుకుంది" అని శివసేన తెలిపింది.

All Prime Minister aspirants from Modi's Opposition 

ఎటువంటి కారణం లేకుండానే నారా చంద్రబాబు నాయుడు తనకు తానుగా ఎందుకు ప్రయాస పడిపోతున్నారని ప్రశ్నించింది. ఆయన పడుతున్న ఆరాటానికి  ఈనెల 23న ఫుల్‌-స్టాఫ్‌ పడనుందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది. కాగా, గత వారం రోజులుగా చంద్రబాబు హస్తిన చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. సోనియా గాంధి, రాహుల్‌ గాంధీ అదే డైనాస్టీపార్టీ కుటుంబంతో పాటు శరద్‌ పవార్‌, మాయావతి, అఖిలేశ్‌ యాదవ్‌, అరవింద్‌ కేజ్రీవాల్‌, శరద్‌ యాదవ్‌, మమతా బెనెర్జీ, స్టాలిన్ లను కలిసి చర్చోప చర్చలు సాగిస్తున్నారు.


ఎన్నికల ఫలితాలకు ముందే విపక్షాలన్నీ ఒక తాటిపైకి రావాలన్న ఉద్దేశంతో ఆయన ఢిల్లీ యాత్రలు చేస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. అయితే ఎగ్జిట్‌-పోల్స్‌ ఫలితాలు ఎన్డీఏకు పూర్తి అనుకూలంగా రావడంలో ప్రతిపక్షాలు ఆలోచనలో పడ్డాయి. ఫలితంగా ఈరోజు జరగాల్సిన ఢిల్లీ పర్యటనను మాయావతి రద్దు చేసుకున్నారు. చివరకు సింగిల్ గా మిగిలేది చంద్రబాబేనని శివసేన భావిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: