హవ్వా..బాబోరు దుర్గమ్మ సొమ్మును కూడా వదిలిపెట్టలేదా?

Edari Rama Krishna

తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రి గా నారా చంద్రబాబు పదవీ భాద్యతలు చేపట్టారు.  ప్రతిపక్ష హోదాలో వైసీపీ కొనసాగుతూ వచ్చింది.  ఈ నేపథ్యంలో చంద్రబాబు ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారని ప్రతిపక్ష పార్టీ ఎప్పటికప్పడు పోరాటాలు చేస్తూ వస్తుంది.


మొన్న ఏపిలో ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.  ఈ సందర్భంగా 23న వచ్చిన ఫలితాల్లో వైసీపీ విజయదుంధుబి మోగించింది.  టీడీపీ చేసిన అక్రమాలే ఆ పార్టీ ఓటమికి కారణాలు వైసీపీ శ్రేణులు అంటున్నారు.


ఇక వైసీపీ ఎంపి విజయసాయి రెడ్డి కొంత కాలంగా ట్విట్టర్ వేధికగా చేసుకొని చంద్రబాబు, టీడీపీని విమర్శిస్తూ..ప్రశ్నిస్తూ వస్తున్న విషయం తెలిసిందే.  తాజాగా ఆయన మరోోసారి ట్విట్టర్ వేధికగా విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాన్నీ చంద్రబాబు ప్రభుత్వం దివాలా తీయించింది.


అమ్మవారి పేరన 140 కోట్ల డిపాజిట్లు ఉండగా స్థల సేకరణ, విస్తరణ పనుల పేరుతో 122 కోట్లు కొల్లగొట్టారు. ప్రస్తుతం 18 కోట్లు మాత్రమే మిగిలాయి. దేవతలను కూడా వదిలిపెట్టలేదేమి చంద్రబాబూ! అంటూ పోస్ట్ చేశారు. 


విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాన్నీ చంద్రబాబు ప్రభుత్వం దివాలా తీయించింది. అమ్మవారి పేరన 140 కోట్ల డిపాజిట్లు ఉండగా స్థల సేకరణ, విస్తరణ పనుల పేరుతో 122 కోట్లు కొల్లగొట్టారు. ప్రస్తుతం 18 కోట్లు మాత్రమే మిగిలాయి. దేవతలను కూడా వదిలిపెట్టలేదేమి చంద్రబాబూ!

— Vijayasai Reddy V (@VSReddy_MP) May 29, 2019

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: