పవన్ కళ్యాణ్ రాజకీయాల నుండి “పవన”మో! పలాయనమో!

పవన్ కళ్యాన్ 2014 ఎన్నికల ప్రచారంలో టిడిపి నాయకత్వంలో బిజేపితో ఏర్పడ్డ సంకీర్ణ ఎన్డీఏని ఎన్నికల్లో గెలిపించమని అందుకు వారు ప్రజలకు జవాబుదారి తనం ప్రదర్శించకపోతే - వారిని ప్రజల తరపున "ప్రశ్నిస్తా!" లేదా "పోరాడతా!" అంటూ టిడిపి-బిజేపీ సంకీర్ణానికి తాను గ్యారెంటీ దారుడు నిలబడుతున్నట్లుగా ప్రజలకు చేసిన వాగ్ధానం ఆయన ఎప్పుడూ నిలబెట్టుకోలేదు. కనీసం అందుకు ప్రయత్నించిన దాఖలాలు లేవు. అసలు చాలా మంది ఆయన మాటలు నమ్మలేదు కూడా! 

దానికి కారణం తన అగ్రజుడు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం దాన్ని కొనసాగించిన తీరు చివరకు తన సిద్ధాంతానికి తిలోదకాలిచ్చి కాంగ్రెస్ మహాసాగరానికి తన కొక మంత్రి పదవికి సాధించుకోవటానికి అమ్మేసిన తీరు ప్రజలకు ఎంతో హృదయవిధారకం. చిరంజీవి ప్రజారాజ్యం పేరుతో ఏడు కోట్ల తెలుగు ప్రజలని నమ్మించి నట్టేట ముంచేసిన తీరుని “అల్లు ఆరవింద్ ఒక సినిమా తీసి విఫలమైనట్లు” గా పోల్చేశారు. అలాంటి పార్టీ యువ నాయకుడుగా ఆ పాపంలో పవన్ కళ్యాన్  భాగస్వామ్యాన్ని నాడు ఆయన ఉపన్యాసాలని విఙ్జులైన తెలుగు ఓటర్లు మరచిపోలేదని, దాని తీరుతెన్నులు చూసి అనుభవించిన ప్రజలకు ఆయనపై తొలి నుండీ విశ్వాసం లేదని, స్వయంగా ఆయనే పోటీ చేసి రెండుచోట్ల ధారుణ పరాజయం పొందటమే పెద్ద ఋజువు.   

"నా జీవితం రాజకీయాలకే అంకితం. నన్ను నలుగురు మోసుకెళ్లే వరకూ జనసేనను మోస్తా! నాకు ఓటమి కొత్త కాదు. దెబ్బ తగిలే కొద్దీ ఎదిగే వ్యక్తిని నేను. ఇరవై ఐదేళ్లు లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చా. ఓటమి ఎదురైన ప్రతిసారీ పైకి లేస్తా! ఇప్పుడు కాకపోతే మరోసారి గెలుస్తా! కానీ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటా! వాళ్ల కోసమే పోరాటం సాగిస్తా!" ఇవీ గత శనివారం జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత తొలిసారి జరిగిన కార్యకర్తల సమావేశంలో మనసు విప్పి మాట్లాడిన ఆయన ఆ విధంగా స్పందించారు.

ఇవన్నీ సినిమా డయలాగులు తప్ప మరేమీ కాదని ప్రజలకు నిశ్చయంగా తెలుసు. ‘స్థిరత్వంలేని ఎంగిలి విస్తరాకు గాలి లో ఎగిరి ఎటుపోతుందో? “ తెలియని విధంగా పవన్ కళ్యాణ్ రాజకీయ రంగప్రవేశం నుండీ ఎన్నికల్లో ఓటమి వరకు ‘గాలి తనం’ దాన్నే ‘పవనిజం’ అనవచ్చేమో? అని అర్ధమైంది. ఒక వారం క్రితం పలికిన పవన్ కళ్యాణ్ పలికిన బీరాలు  భెషజాల పై ఇప్పుడు ఇప్పుడు తీసుకున్న "యూటర్న్" ఆయన త్వరలోనే మరోసారి సినీరంగంలోకి రాబోతున్నారని సమాచారం అందించినట్లే. 


ఈ విషయంపై ఎప్పటి నుంచో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. వాస్తవానికి ఎన్నికల ముందే పవన్ కళ్యాణ్ గతంలో తాను గతంలో “మాట యిచ్చిన” సినిమా భాషలో కమిట్మెంట్ ఇచ్చిన  నిర్మాతల కోసం సినిమాలు చేయబోతున్నాడని ప్రచారం జరిగింది. కానీ, అది జరగలేదు. పైగా ఇటీవల తాను రాజకీయాల్లోనే ఉంటాను అని నిర్ణయాత్మకంగా చెపారు. ఇలాంటి సమయంలో ఈ సమాచారం పవన్ కళ్యాణ్  తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు అర్ధమౌతూనే ఉంది.

నిర్ణయాలు ప్రకటించటం వెనక్కి తీసుకోవటం పవన్ కళ్యాణ్ ప్రజాజీవితంలోకి ప్రవేశించిన నాటి నుండీ ప్రజలకు తేటతెల్లం అవుతూనే ఉంది. నిబద్దత ఏమాత్రం లేని పవన్ కళ్యాణ్ ను నమ్మి జనం ఓటు వేయలేదు. 


రాజకీయాలపై పూర్తిగా దృష్టి సారించడానికి ముందు పవన్ కల్యాణ్ ముగ్గురు నిర్మాతల దగ్గర అడ్వాన్స్ తీసుకున్నారని టాలీవుడ్ లో వినిపిస్తుంది. ఇప్పుడు వారి కోసం సినిమాలు చేయడానికి పవన్ కల్యాణ్ సిద్ధం అవుతున్నారట. అంతేకాదు, దీనిపై ఎవరైనా ప్రశ్నిస్తే దానికి సమాధానం కూడా రెడీ చేసేశారట జనసేన అధినేత. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పార్టీని నడిపేందుకు అవసరమైన డబ్బులు తన వద్దలేవని, అందుకోసం రెండో మూడో సినిమాలు చేసి పార్టీ కోసం పనిచేస్తున్న వారికి సాయం చేస్తానని ఆయన చెప్పబోతున్నారని విశ్వసనీయ సమాచారం. 

నిజానికి దీని గురించి కొద్దిరోజుల క్రితమే ప్రముఖ సినీ రాజకీయ విమర్శకుడు కత్తి మహేశ్ సోషల్ మీడియా లో ఒక  పోస్ట్ చేశారు. "మన పార్టీ కోసం పేపర్ పెడతాను అని పవన్ కల్యాణ్ అంటున్నారు. ఆయనకు డబ్బులెలా వస్తాయి. ఉన్న టీవీ ఛానెల్ మెయింటైన్ చెయ్యలేక అమ్మేసుకుంటున్నావ్. ఇప్పుడు పత్రిక పెట్టడానికి సినిమాల్లో నటిస్తావు.... అంతేగా. ఎంతైనా ముగ్గురు  నిర్మాత ల దగ్గర ఆల్రెడీ బయానా తీసుకున్నావుగా! నువ్వు భలే చిలిపి పవనూ!’’ అంటూ ఆయన వ్యంగ్యంగా పోస్టు చేశారు. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల్లో ఈయన చేసిన పోస్ట్ నిజం కాబోతుందనే టాక్ వినిపిస్తోంది.


150 కి పైగా సినిమాల్లో నటించి ఒక దశాబ్ధం గాప్ తీసుకున్న మెగా స్టార్ చిరంజీవి స్టామినా ప్రజలకు తెలుసు అందుకే నిరీక్షించారు ఖైదీ నంబర్ 150 ఒక మాదిరి సినిమాని దిగ్విజయం లభించేలా చేశారు. అదే పవన్ కళ్యాణ్ ఇప్పటికి చివరి సినిమా "అఙ్జాతవాసి" తో నిండా మునిగిన నిర్మాతల అనుభవం చూసి ఇష్టం లేకపోయినా నిర్మాతలు సినిమా ఆయనతో నిర్మించిన పట్టుమని పాతిక సినిమాల్లో 60% వైఫల్యాలు చవిచూసిన పవన్ కళ్యాణ్ సినిమా కోసం ఎవరూ నిరీక్షించరు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: