జగన్ దే పై చేయి

Satya
జగన్ స్టార్ ఇపుడు బాగా పరుగులు తీస్తోంది. ఆయన ఏదంటే అదే జరుగుతోంది. నిన్నటి వరకూ జగన్ని కాదన్న వారే ఇపుడు అవును అంటున్నారు. జగన్ కోసం వేచి చూస్తున్నారు. జగన్నినాదమే సర్వతా  వినిపిస్తోంది. జగమే జగన్ గా అలరిస్తోంది.



ఇదిలా ఉండగా కొత్త ప్రభుత్వం తొలి శాసన సభ అయిదు రోజుల పాటు జరిగింది. ఈ సభలో మొత్తానికి మొత్తం జగన్ పై చేయి సాధించారు.  మరో వైపు ఫార్టీ యియర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు విపక్ష స్థానంలో ఉన్నా కూడా ఆయన  పూర్తిగా ప్రేక్షకుడు అయిపోయారు. ఓ విధంగా చంద్రకళ తప్పేసిన సభగా చెప్పుకోవాలి.


మరో వైపు జగన్మోహనంగా సభ సాగింది. చంద్రబాబు మాటలు తగ్గించేశారు. ఆయన మాట్లాడినా అందులో తప్పులు పట్టుకుని వైసీపీ ఎమ్మెల్యేలు ఓ రేంజిలో ఆటాడారు. దాంతో మౌనమే దాల్చారు. మొత్తానికి   తొలి సభలో పూర్తిగా జగన్ బాబుపై  పై చేయి సాధించారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: