ఆ ఆరోపణ నిజమైతే తాను ప్రాణత్యాగానికి సిద్ధం అంటున్న నన్నపనేని..?

venugopal Ramagiri
గుంటూరు జిల్లా మంగళగిరి పోలీసుస్టేషను వద్ద ఈనెల 11వ తేదీన విధి నిర్వహణలో ఉన్న మహిళా ఎస్సై జే.అనూరాధ పట్ల అనుచితంగా ప్రవర్తించి,అసభ్య పదజాలంతో దూషించి,విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలపై టీడీపీ నాయకురాలు, రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ చైర్‌పర్సన్ రాజకుమారి,మరో నేత సత్యవాణిపై పోలీసు స్టేషనులో కేసు నమోదయిందన్న విషయం తెలిసిందే.ఇక టీడీపీ సీనియర్ నేత,నన్నపనేని రాజకుమారిపై ఈ కేసు వ్యవహారం రాజకీయ రంగు పులుముకుని,ఈ పోరు టీడీపీ వర్సెస్ వైఎస్సార్‌సీగా మారింది..



ఈ మధ్య జరుగుతున్న చలో ఆత్మకూరు వ్యవహారంలో తన పై అనవసరంగా కేసులు నమోదు చేశారని, జీపు బాగాలేదు దరిద్రంగా ఉందని నేను అన్న ఓచిన్నమాట కారణంగా,మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి నాపై కక్షకట్టి,ఎస్సైని రెచ్చగొట్టి జీపు దగ్గరకు పంపించారని నన్నపనేని ఆరోపించారు.నేను ఎస్సెను దూషించి తప్పుచేసినట్లు,ఏ చిన్న ఆధారం ఉన్నా,దేవుడి సాక్షిగా,నా బిడ్డలసాక్షిగా చెబుతున్నా.జైలుకు,కోర్టుకు వెళ్లడం కాదు నేను ఆ మాట అనుంటే ప్రాణ త్యాగానికి సిద్ధం’అని ఆవేశంగా మాట్లాడారు నన్నపనేని రాజకుమారి.



ఈ నింద తనపై వేసే ముందు,తాను ఒక్కమాట కూడా ఎవరిని అనలేదని ఆరోపణ చేసేవారు గుర్తుచేసుకోవాలి,అసలు తాము ఏం మాట్లాడాం,వారు ఏం మాట్లాడారో ఓసారి పరిశీలించొచ్చన్నారు. సీనియర్ రాజకీయ నేతగా ఉన్న తనపై ఇంత హీనంగా వ్యాఖ్యలు చేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.ఇక ఈ అబద్దపు ఆరోపణలను నమ్మి తనకు నోటీసులు పంపిస్తే,బెయిల్ కూడా అడగనని,ఏ పోలీస్ స్టేషన్‌కు అయినా వెళ్లేందుకుతాను  సిద్ధమన్నారు నన్నపనేని.అసలు సాక్ష్యం లేకుండా ఆరోపణలు చేయడం ఏంటని.తనపై రోజుకో ఆరోపణ చేస్తే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి నిరూపించుకోవాలా అంటూ ఆర్కే చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు.త్వరలోనే తనపై చేస్తున్న ఆరోపణలు అబద్దమని తేలుతుందని..తాను ఎస్సైను ఏమీ అనలేదని నిరూపణ జరిగితే ఆర్కే పదవీ త్యాగం చేస్తారా అంటూ సవాల్ విసిరారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: