సీఎం కేసీఆర్‌పై మండిపడుతున్న రేవంత్ రెడ్డి ?

venugopal Ramagiri
తెలంగాణాలో ఉద్యమాలు కొత్తేం కాదు. ఉద్యమాలకోసం ప్రాణాలను కూడా పువ్వుల్లాగ రాలగొట్టుకునే త్యాగ శీలురు పుట్టిన గడ్డ ఇది. నాటి నిజాం పాలన నుండి చూసుకుంటే ఇప్పటివరకు ప్రతి ఉద్యమాల్లో నష్టపొయేది ప్రజలే. కాని సుఖాలు అనుభవించేది మాత్రం నాయకులు ఇది ప్రజలకు జరుగుతున్న అన్యాయం. ఇక ఇప్పటికే టీఎస్ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మే పదకొండోవరోజుకు చేరుకుంది. ఈ సమ్మె వల్ల విద్యార్ధులు, ఉద్యోగులు, ప్రజలు ఎంతగా నష్టపోతున్నారో తెలుసుకోలేని స్దితిలో ఇక్కడి వ్యవస్ద వుంది. ఈ నష్టం తాలుకు ప్రభావం తెలంగాణ ప్రజలు ముందు ముందు తప్పక భరించవలసిన పరిస్దితులు ఎదురవుతాయి.


ఈ దశలో నిమ్మకు నిరెత్తినట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తుంటే, కార్మికులు కూడా రొమ్ము విరిచి ఎదురు నిల్చున్నారు. తమ హక్కులను సాధించడం కోసం బలిదానాలకు కూడా సిద్ద పడుతున్నారు. వీరికి మద్దతుగా ఎన్నో సంఘాలు కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజా సంఘాల నేతలు, పొలిటికల్ లీడర్లు కార్మికులకు సపోర్టుగా నిలుస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని మండిపడుతున్నారు. తాజాగా మల్కాజిగిరి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మరోసారి సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులపై నిప్పులు చెరిగారు. తెలంగాణ ఉద్యమంలో క్రీయాశీలకంగా కనిపించిన ఆర్టీసీ కార్మికులు ఇవాళ మీకు కనిపించడం లేదా అంటూ ఫైరయ్యారు.


కేసీఆర్ తీరును ఎదురించలేని పరిస్థితిలో మంత్రులు ఉండటం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. అంతే కాకుండా కొన్ని సంఘాలకు గుర్తింపు లేదంటూ వారితో చర్చలు జరిపే ప్రసక్తి లేదనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. బయటకు వచ్చి మాట్లాడే దమ్ము లేక కేసీఆర్, స్క్రిప్టులు పంపుతూ పేపర్లలో రాయించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని కొందరు ఇవాళ కేసీఆర్ ప్రభుత్వంలో కీ రోల్ పోషిస్తున్నారని ఆరోపించారు. ఆనాడు ఉద్యమానికి ఏమాత్రం అండగా నిలబడని వాళ్లు ఇవాళ మంత్రులుగా చలామణీ అవుతున్నారని.. సీఎం కేసీఆర్ చెప్పిన దానికి తలాడిస్తూ జీ హుజుర్ అంటున్నారని మండిపడ్డారు.


మంత్రులుగా స్వతంత్రం లేని వీళ్లు.. ఆర్టీసీ సమ్మె చట్టబద్ధం కాదంటూ ఆయన ఇచ్చిన స్క్రిప్టునే వల్లె వేస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ సాధన కోసం చెమట చిందించ నోళ్లు కూడా ఇవాళ ఆర్టీసీ సమ్మె సరికాదనడం భావ్యం కాదన్నారు. ఆర్టీసీ కార్మిక సంఘాలకు దగ్గరగా మెదిలిన ఈటల రాజేందర్, హరీశ్ రావు ఈ సమ్మె గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదని.. అదే క్రమంలో ఆ ముగ్గురు మంత్రులు మాత్రం కేసీఆర్ చెప్పినట్లు ఆర్టీసీ సమ్మె తప్పు అని మాట్లాడుతుండటం దేనికి నిదర్శనమని ప్రశ్నించారు.  ప్రజలు అన్ని గమనిస్తున్నారాని. త్వరలోనే ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజు వస్తుందని, ఎన్నాళ్లూ ఇలా మభ్యపెట్టి పాలన సాగిస్తారని విరుచుకుపడ్డారు రేవంత్ రెడ్డి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: