కేసీఆర్‌కు బీపీ పెంచే జాబితాలో చేరిన ప‌వ‌న్‌

Pradhyumna
ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వ వైఖరిలో మార్పు లేక‌పోవ‌డం...కార్మికుల ఆందోళనలు రోజు రోజుకు ఉధృతం అవుతుండ‌టంతో... స‌మ్మె వాడీ వేడి ఏ మాత్రం తగ్గలేదు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు అనూహ్యంగా మద్దతు ప్రకటించిన తెలంగాణ ఉద్యోగ, గజిటెడ్ అధికారుల, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంయుక్త కార్యాచరణ కమిటీ ప్రతినిధి బృందం సచివాలయానికి వచ్చి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషితో సమావేశమైంది. తమ అపరిష్కృత డిమాండ్లతో పాటు ప్రధానంగా ఆర్టీసీ సమ్మెతో చోటు చేసుకున్న పరిణామాలను వారు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ఆర్టీసీ కార్మికులకు తాము కూడా మద్దతు ప్రకటించామని, ప్రభుత్వం వెంటనే స్పందించి సమ్మెను విరమింప చేయడానికి చొరవ తీసుకోవాల్సిందిగా కోరింది. లేని పక్షంలో కార్మికుల ఆందోళనలో తాము కూడా భాగస్వాములం కాకతప్పదని హెచ్చరించారు. 


ఇలా వివిధ ప‌క్షాలు త‌మ పోరాటంలో భాగ‌స్వామ్యం అవుతుండ‌గా...తాజాగా ఈ జాబితాలో జనసేన పార్టీ చేరింది. తెలంగాణ జనసేన పార్టీ ఇన్చార్జ్ {{RelevantDataTitle}}