లోకేశ్ Vs బ్రహ్మణి.. ఇదేం ఇంటిపోరు..!?

Chakravarthi Kalyan
అభినవ చాణక్యుడిగా చంద్రబాబుకు పేరుంది. ఎలాంటి విషయాన్నైనా సున్నితంగా డీల్ చేయగల సమర్థుడాయన. ఆంధ్రా, తెలంగాణ ఇష్యూ గానీ.. ఇంట్లో వారసత్వపోరు గానీ.. కర్ర విరగకుండా, పాము చావకుండా నేర్పుగా వ్యూహాలు రచించడంలో దిట్ట. తన రాజకీయ వారసుడిగా లోకేశ్ ను తీర్చిదిద్దడంలోనూ ఆయన అదే నేర్పు చూపించారు. క్రమంగా జూనియర్ ఎన్టీఆర్ ను సీన్ నుంచి తప్పించి రేసులో లేకుండా చేశారు. 

లోకేశ్ ను ఎన్నికల్లో పోటీ చేయించకుండా.. నేరుగా మంత్రివర్గంలోకి తీసుకోకుండా  ప్రస్తుతానికి ట్రైనింగ్ సెషన్ నడుపుతున్నారు. ఎమ్మెల్యేగానో, మంత్రిగానో బాధ్యతలు అప్పగిస్తే మీడియా ఎప్పటికప్పుడు బేరీజు వేస్తుంది. బాధ్యతలను నిలదీస్తుంది. ఇప్పుడైతే బాధ్యతలు లేని అధికారం.. తప్పులు జరిగినా సంబంధింత మంత్రిపైనో, పార్టీపైనే తోసేయవచ్చు..ఇదీ బాబు ఆలోచన.

అంతవరకూ బాగానే ఉంది. ఐతే..లేటెస్టుగా మీడియా ముందుకు లోకేశ్ భార్య, బాలయ్య కూతురు అయిన తన కోడలు బ్రహ్మణిని మీడియా ముందుకు తీసుకురావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. నిన్న మొన్నటివరకూ లోకేశ్ పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి చేపట్టే ముందు వరకూ.. టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి కన్వీనర్ గా ఇలాంటి ప్రెస్ మీట్లు లోకేశే పెట్టేవారు.

మరి లోకేశ్ టాలెంట్ పై సందేహంతో బ్రహ్మణిని తెరపైకి తెచ్చారా.. లేక.. పార్టీని కొడుకు, ఎన్టీఆర్ ట్రస్టును కూతురు చూసుకుంటారన్నదానికి సంకేతంగా బ్రహ్మణి మీడియా ముందుకు వచ్చిందా అన్నది అంతుచిక్కని ప్రశ్న. లోకేశ్ ను ఎంత ప్రమోట్ చేసినా.. వాగ్దాటి, వ్యూహాల విషయంలో అనుకున్నంత పురోగతి లేకపోవడంతోనే.. బ్రహ్మణిని తెరపైకి తెచ్చారన్న వాదన వినిపిస్తున్నా.. చంద్రబాబు అలాంటి నిర్ణయం తీసుకుంటారా అన్నది సందేహమే. కానీ మొత్తానికి ఏదో విషయం ఉందన్న సంగతి మాత్రం అర్థమవుతూనే ఉంది.  



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: